Nallala Odelu : తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పట్టు సడలుతోందా? నేతలంతా పక్క చూపులు చూడడం మొదలుపెట్టారా? పార్టీ కోసం సేవ చేసినా.. సీట్లు, పదవులు త్యాగం చేసిన వారంతా ఇప్పుడు ప్రత్యామ్మాయ పార్టీల వైపు మరలుతున్నారా? టీఆర్ఎస్ లో తమకు ఇక ప్రాధాన్యత దక్కదని పార్టీ మారుతున్నారా? టీఆర్ఎస్ కు మున్ముందు భారీ షాక్ లు తప్పవా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి.. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్నారు. పోయిన ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ సీటును కేసీఆర్ ఇప్పటికే నాలుగైదు సార్లు గెలిచిన ఓదెలుకు ఇవ్వకుండా టీఆర్ఎస్ యువనేత బాల్క సుమన్ కు ఇవ్వడం చిచ్చు రేపింది. నాడు బాల్క సుమన్ కోసం సీటును త్యాగం చేసిన నల్లాల ఓదెలు అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేకపోవడంపై బరెస్ట్ అయ్యాడు. విసిగివేసారి గురువారం మధ్యాహ్నం వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
-సింగరేణి నుంచి ఉద్యమనేతగా నల్లాల ఓదెలు
సింగరేణిలో కార్మిక నేతగా ఉన్న నల్లాల ఓదెలు తెలంగాణ ఉద్యమంలో చరుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరుఫున కొట్లాడారు. ఈ క్రమంలోనే 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్ గానూ ఓదెలు పనిచేశారు. భాగ్యలక్ష్మీకి జడ్పీ చైర్ పర్సన్ పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైగానే ఉంది. అయినా కూడా పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో అలిగి పార్టీని వీడారు.
-నల్లాల ఓదెలు టీఆర్ఎస్ ను ఎందుకు వీడారంటే?
ప్రధానంగా తన చెన్నూరు అసెంబ్లీ సీటును బల్కసుమన్ కు ఇవ్వడాన్ని ఆది నుంచి నల్లాల ఓదెలు జీర్ణించుకోవడం లేదు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. తన భార్యకు జడ్పీ చైర్మన్ ఇచ్చినా కూడా ఓదెలు ఖాళీగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఉద్యమంలో అంత కొట్లాడిన తనను టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంపై రగిలిపోయాడు. ఇక చెన్నూరు నియోజకవర్గ టీఆర్ఎస్ లో విభేదాలు పతాకస్థాయికి చేరాయి. దీంతో ఓదెలు దంపతులు పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో అగాధం పెరగడం.. అతడితో విభేదాల కారణంగానే ఓదెలు పార్టీని వీడినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా అందరి అభిప్రాయాలు తీసుకొని చర్చించిన ఓదెలు టీఆర్ఎస్ ను వీడి చెన్నూరు నియోజకవర్గంలో నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్న కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓదెలు అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
[…] Also Read: Nallala Odelu : టీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస… […]