Elon Musk- Twitter: ఎలాన్ మస్క్. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. ట్విటర్ కొనుగోలుతో ఆయన పేరు మారుమోగుతూనే ఉంది. ట్విటర్ ను సొంతం చేసుకున్న మస్క్ ఈ ఏడాది డిసెంబర్ లోగా సంస్థను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు ఉద్యోగులను సైతం తొలగించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ఏమైందో ఏమో గానీ మస్క్ లో మరో ఆలోచన తడుతోన్నట్లు సమాచారం. ట్విటర్ ను కొనుగోలు చేస్తే వచ్చే లాభం ఏమిటనే ప్రశ్న ఆయనలో వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ట్విటర్ ను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ట్విటర్ ను కొనుగోలు చేస్తే దాదాపు మూడున్నర లక్షల కోట్లు చెల్లించాలి. ఒక వేళ ఒప్పందం నుంచి తప్పుకుంటే ఏడున్నర వేల కోట్లు పరిహారం అందజేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేస్తారా? లేక ఆ నిర్ణయానికి తూట్లు పొడుస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికి మస్క్ ఎన్ని వేషాలు వేసినా ట్విటర్ ను కొనుగోలు చేయాల్సిందే. అప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం మస్క్ ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. సంస్థను కొనుగోలు చేయకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా కుదరదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ట్విటర్ ను కొనుగోలు చేయాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: Nallala Odelu : టీఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన అధికారిక పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్
ఒప్పందం నుంచి ఎవరు వైదొలిగినా బిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆనాడే రాసుకున్నారు. అందుకే ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తే వీలు లేదని తెలుస్తోంది. ముక్కు పిండి అయినా ఆయన చేత కొనిపిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ఎన్ని కుట్రలు వేసినా చెల్లదని తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది.

మొదట్లో ఉద్యోగులను మారుస్తాం అని చెప్పిన మస్క్ ప్రస్తుతం మనసు మార్చుకుని సంస్థను కొనుగోలు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో తెలియడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన బుర్ర ఎందుకు గిర్రున తిరిగిందో అర్థం కావడం లేదు. మొత్తానికి ట్విటర్ వ్యవహారంలో ఎలన్ మస్క్ ఎందుకు మనసు మార్చుకుని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదో అర్థం కావడం లేదు. అప్పుడేమో ఎంతకైనా బేరం ఆడి మరీ సంస్థను దక్కించుకోవాలని ముందుకు వచ్చారు. ఇప్పడు ఎంత ఖర్చు అయినా ఫర్వా లేదు ఒదిలించుకోవాలని చూస్తున్నారు. దీనిపై ఉద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొంది. మస్క్ తీరుపై విమర్శలే వస్తున్నాయి.
Also Read:Hero Vijay Meet KCR: కేసీఆర్ ను స్టార్ హీరో కలవడం వెనుక పెద్ద ప్లానే ఉందే!
[…] […]