https://oktelugu.com/

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభ్యత్వ ఫీవర్

‘‘ప్రతీ నియోజకవర్గంలో లక్షన్నరకు పైగా సభ్యత్వాలు పూర్తి చేయాలి.. యువతను ప్రధానం గులాబీ దళంలో చేర్పించాలి.. ప్రతీ ఎమ్మెల్యే.. అన్ని పనులు వదిలిపెట్టి.. మెంబర్ షిప్ లపైనే దృష్టి సారించాలి. గ్రామాల్లో.. పట్టణాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. మెంబర్ షిప్ ఇవ్వడం.. డబ్బులు చెల్లించడం ఇబ్బందిగా పలువురు అంటున్నారు. కొందరైతే మెంబర్ షిప్ కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2021 / 01:53 PM IST
    Follow us on


    ‘‘ప్రతీ నియోజకవర్గంలో లక్షన్నరకు పైగా సభ్యత్వాలు పూర్తి చేయాలి.. యువతను ప్రధానం గులాబీ దళంలో చేర్పించాలి.. ప్రతీ ఎమ్మెల్యే.. అన్ని పనులు వదిలిపెట్టి.. మెంబర్ షిప్ లపైనే దృష్టి సారించాలి. గ్రామాల్లో.. పట్టణాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. మెంబర్ షిప్ ఇవ్వడం.. డబ్బులు చెల్లించడం ఇబ్బందిగా పలువురు అంటున్నారు. కొందరైతే మెంబర్ షిప్ కోసం ఏకంగా బంపర్ స్కీంలే ప్రకటిస్తున్నారు. ఈ హామీల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముందు వరుసలో ఉన్నారు.

    Also Read: తరగని నీటి జ్వాల.. ‘కాళేశ్వరం’ రికార్డు

    పార్టీ ఆవిర్భావ దినోత్సం లోపు సభ్యత్వాల లక్ష్యాలను పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా 50వేలు గరిష్టంగా లక్షన్నర మెంబర్ షిప్ లు పూర్తి చేయాలని పార్టీ నేతలకు టార్గెట్ విధించారు. సహజంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు.. ఇన్చార్జిలపై పడుతుంది. ఇప్పుడు ఆ సభ్యత్వాల నమోదు వారికి తలకు మించిన భారంగా మారింది. ఎవరిపేర్లు పడితే.. వారి పేర్లు సారి..సభ్యత్వ చందా తామే కట్టేస్తే.. పని పూర్తి అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు.

    ఓటర్ ఐడీతో సహా మొత్తం డేటా సేకరించాల్సి ఉంటుంది. ఆ వివరాలు యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి ఎమ్మెల్యేలకు , ఇన్చార్జీలకు పెద్దగా కర్యకర్తలు దొరకడం లేదు. ఉన్నవారందరికీ సభ్యత్వాలు చేయించినా.. పదివేలకు మించడం లేదు. దాంతో ప్రభుత్వ పథకాలు పొందిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పొందేవారు ప్రతీ ఒక్కరూ.. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. లేకుండా పథకాలు ఆగిపోతాయని భయపెడుతున్నారు.

    Also Read: అడ్డంగా దొరికిన బీజేపీ నేత.. షాక్ లో ముఖ్య నేతలు

    జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య అదే పనిలో ఉన్నారు. గ్రామాల్లో సభలు పెట్టి సభ్యత్వాలు తీసుకోవాలని బెదిరిస్తున్నారు. వీరి మాటలను గమనిస్తున్న కొంతమంది వీడియోలు.. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుండగా.. ఇప్పుడు అవి వైరల్ గా మారుతున్నాయి. ఇంత చేస్తున్నా.. అనుకున్న లక్ష్యం చేరడం లేదు. కనీసం యాబై లక్షల సభ్యతాలు చేయించాలని కేటీఆర్ సూచించగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఎమ్మెల్యేలు.. ఇన్ చార్జీలకు ఇబ్బందికరంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్