తరగని నీటి జ్వాల.. ‘కాళేశ్వరం’ రికార్డు

వేసవిలోనూ తరగని నీటి సంపద కాళేశ్వరం సొంతం. కాళేశ్వరంలో ప్రాణహిత నుంచి మే వరకు కూడా నీటి జాడలు వస్తాయి. సో వేసవిలో కూడా సాగుకు అక్కర్లేకున్నా… తాగునీటి అవసరాలు మాత్రం ఈ కాళేశ్వరం తీర్చుతోంది. తాజాగా కాళేశ్వరం పంపులు ఏకంగా 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సంచలనం సృష్టించాయి. దేశంలో క్లిష్టమైన కష్టమైనది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. తెలంగాణ సర్కార్ .. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ ఇదీ. దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం మూడేళ్ళలోనే […]

Written By: NARESH, Updated On : March 1, 2021 1:43 pm
Follow us on

వేసవిలోనూ తరగని నీటి సంపద కాళేశ్వరం సొంతం. కాళేశ్వరంలో ప్రాణహిత నుంచి మే వరకు కూడా నీటి జాడలు వస్తాయి. సో వేసవిలో కూడా సాగుకు అక్కర్లేకున్నా… తాగునీటి అవసరాలు మాత్రం ఈ కాళేశ్వరం తీర్చుతోంది. తాజాగా కాళేశ్వరం పంపులు ఏకంగా 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సంచలనం సృష్టించాయి.

దేశంలో క్లిష్టమైన కష్టమైనది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. తెలంగాణ సర్కార్ .. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ ఇదీ. దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం మూడేళ్ళలోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేస్తోంది. కాళేశ్వరంలోని అతి కీలకమైన పంప్ హౌస్, మొట్టమొదటిది లక్ష్మీ పంప్ హౌస్. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది.

ఈ పంపింగ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ.కె. చంద్రశేఖర రావు జూలై 6 న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కేవలం 508 రోజుల్లోనే 100 టిఎంసీలకు పైగా నీటిని పంప్ హౌస్ లు ఎత్తిపోసి రికార్డు సృష్టించాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ కలల ప్రాజెక్టులో కీలకమైన ఎత్తిపోతల విభాగం రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో నీటి పంపులు ద్వారా ఎత్తిపోసింది. ఈ ఎత్తిపోతల పథకం నుంచి అనతికాలంలోనే రికార్డ్ స్థాయిలో నీటి పంపింగ్ జరిగింది. ఇదో రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ పథకంలోని ఒక్కొక్క పంపింగ్ కేంద్రం టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి వివిధ దశల్లో మొత్తం మీద 100 టిఎంసీల చొప్పున పంపింగ్ ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

కాళేశ్వర నుంచి ఈ పంపుల ద్వారా తెలంగాణ మొత్తం ప్రాజెక్టుల్లోకి నీటి తరలింపు గడిచిన కొద్దికాలంగా సాగుతోంది.. లింక్-1,2 పంప్‌హౌస్‌లు మీదుగా ఎగువకు ఉరకలు వేస్తున్నది. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ, గాయత్రి పంపింగ్ కేంద్రంలోని మోటర్ల నుంచి ఎగిసి పడుతూ మిడ్ మానేరుకు పరుగులు తొక్కుతున్నది. ఎండాకాలంలోనూ ఎగువ నుంచి వస్తున్న నీటిని ఎల్లంపల్లికి తరలిస్తూ కాళేశ్వరం పంప్ హౌస్ లు తెలంగాణ తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తున్నాయి.