విశాఖ స్టీలుప్లాంటు ప్రయివేటీకరణ వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడీ అంశం ఏపీలో కాక రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో జగన్ సర్కారుకు ప్లాంటు ప్రయివేటీకరణ సెగ గట్టిగానే తాకుతోంది. పోలింగ్ లోపు ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్పా.. అక్కడ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. ప్లాంటు ప్రయివేటీకరణలో భాగంగా పోస్కో ఇండియాకు వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆశ చూపుతున్ననేపథ్యంలో అదే సంస్థను కృష్ణపట్నంలో గ్రీన్ పిల్డ్ ప్లాంటు ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు బదులు వేరే సంస్థ పెట్టాలని ఆఫర్ ఇచ్చింది.
Also Read: తరగని నీటి జ్వాల.. ‘కాళేశ్వరం’ రికార్డు
వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వైపీసీకి విశాఖలో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిర్ణయం తీసుకున్న బీజేపీకి వైజాగ్లో పెద్దగా పట్టు లేకపోవడంతో టీడీపీ వైసీపీ మధ్యే మున్సిపల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. దీంతో స్టీల్ ప్లాంటు విషయంలో సరైన ఆలోచన చేసి వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. అయితే స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ ఆగకుంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. టీడీపీ దీన్నే అస్ర్తంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తుంది.
ఈ నేపథ్యంలో ఓ వైపు కేంద్రంతో మంతనాలు జరుపుతూనే.. మరోవైపు స్టీల్ ప్లాంటు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోస్కో కంపెనీతో వైసీపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. స్టీల్ ప్లాంటును దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. కేంద్రం ఆలోచనకు అడ్డుకట్ట వేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే ఇప్పటికే కేంద్రం ప్లాంటు విషయంలో నిర్ణయం తీసుకుంది. త్వరలో బిడ్డింగు కు కూడా వెళ్లబోతోంది.
Also Read: అడ్డంగా దొరికిన బీజేపీ నేత.. షాక్ లో ముఖ్య నేతలు
దీంతో విశాఖ స్టీల్ ప్లాంటు నుంచి పోస్కో దృష్టి మళ్లించేందుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో మరోచోట గ్రీన్ ఫీల్డ్ ప్లాంటు ఏర్పాటు కోసం సహకారం అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నెల్లూరులోని కృష్ణపట్నంలో ఓ కొత్త స్టీల్ ప్లాంటు నిర్మించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పోస్కో ఇండియాకు ఏపీ సర్కారు ఆదివారం లేఖ రాసింది. పోస్కో ముందుకు వస్తే.. కృష్ణ పట్నంలో కావల్సిన భూమి.. ఇతర సదుపాయాలు అందించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశం ఆసక్తిగా మారింది. కంపెనీ ఒప్పుకుంటే జగన్ ప్లాంటు విషయం విజయం సాధించినట్లేనని నిపుణులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్