https://oktelugu.com/

గ్రేటర్‌లో టీఆర్ఎస్ నేతల హడావుడి షూరు..!

త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ముందస్తుగానే టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అవుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా కాలనీలు, బస్తీల మొఖం చూడని నేతలు సైతం ఇప్పుడు కార్పొరేషన్లలో హడావుడి చేస్తున్నారు. బస్తీల్లో పర్యటలను చేస్తూ ప్రజలు అడిగిందే తడవుగా సాయం అందిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 27, 2020 / 02:10 PM IST
    Follow us on


    త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ముందస్తుగానే టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అవుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా కాలనీలు, బస్తీల మొఖం చూడని నేతలు సైతం ఇప్పుడు కార్పొరేషన్లలో హడావుడి చేస్తున్నారు. బస్తీల్లో పర్యటలను చేస్తూ ప్రజలు అడిగిందే తడవుగా సాయం అందిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

    Also Read: తెలంగాణలో అవినీతి కథ.. మారుతోందా?

    నాలుగేళ్లుగా హామీలు నెరవేర్చని నేతలు ఇప్పటిఇప్పుడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ఎన్నికల సమయాని కల్లా గతంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసేలా నేతలు కసరత్తులు చేస్తున్నారు. అయితే కొన్ని కార్పొరేషన్లలో టీఆర్ఎస్ నేతలను రానివ్వడం లేదని తెలుస్తోంది. నాలుగేళ్లుగా బస్తీల ముఖంచూడని నేతలు ఎన్నికలు వస్తున్నాయని పర్యటనలు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతోన్నారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇటీవల కురిసిన వానలకు నగరం అస్తవ్యస్తంగా మారి తాము ఇబ్బందులు పడ్డామని.. అప్పుడురాని నేతలు ఇప్పుడు వస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుత టీఆర్ఎస్ కార్పొరేటర్లు బస్తీల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి త్వరలోనే రూ.200 కోట్లు విడుదల చేయనుందని సమాచారం. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ప్రాంతాల్లో ఈ నిధులను తక్షణమే వినియోగించేలా టీఆర్ఎస్ సర్కార్ వ్యూహాలను రచిస్తోంది. ఒక్కో కార్పొరేటర్ కు రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు మంజూరు చేస్తారని తెలుస్తోంది. గతంలోనే మాదిరిగానే ఈసారి గ్రేటర్ ఎన్నికలను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండటంతో నేతలు అలర్ట్ అవుతున్నారు. కేటీఆర్ సైతం ఎప్పటికప్పుడు కార్పొరేటర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుత కార్పొరేటర్లపై ప్రజల్లో ఏవైనా వ్యతిరేకత ఉన్నాయా? అంటూ ఆరా తీస్తున్నారు. నేతల పనితీరు ఆధారంగానే ఈసారి టిక్కెట్ కేటాయించేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు.

    Also Read: కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

    దీంతో నిన్నటి వరకు కరోనా సాకుతో ఇంటికే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు బస్తీల్లో హడావుడి చేస్తున్నారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు.. పర్యటనలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా గ్రేటర్లో ప్రచారం మొదలెట్టేలా కన్పించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి దూసుకెళ్లాల్సినా ప్రతిపక్షాలు గ్రూపు రాజకీయాలతో మిన్నకుండిపోతున్నాయి. నగరంలో కరోనా ఎఫెక్ట్.. వరదల కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ఏమేరకు కాంగ్రెస్, బీజేపీలు తమకు అనుకూలంగా మల్చుకుంటాయనేది వేచి చూడాల్సిందే..!