https://oktelugu.com/

ఆ ఫ్లాప్‌ మూవీ సీక్వెల్‌ను నమ్ముకున్న షారూక్‌ ఖాన్‌

బాలీవుడ్‌ బాద్‌షా. కింగ్‌ ఖాన్‌. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. హిందీ అగ్ర నటుడు షారూక్‌ ఖాన్‌ గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. అసలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి బాలీవుడ్‌ను ఏలిన నటుడు అతను. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం (సల్మాన్‌, ఆమిర్)లో చాన్నాళ్లు అతనే ముందున్నాడు. కానీ, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌ వరుస హిట్లతో దూసుకుపోతోంటే షారూక్‌ మాత్రం వెనుకబడ్డాడు. అతను సరైన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 27, 2020 / 02:34 PM IST
    Follow us on


    బాలీవుడ్‌ బాద్‌షా. కింగ్‌ ఖాన్‌. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. హిందీ అగ్ర నటుడు షారూక్‌ ఖాన్‌ గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. అసలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి బాలీవుడ్‌ను ఏలిన నటుడు అతను. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం (సల్మాన్‌, ఆమిర్)లో చాన్నాళ్లు అతనే ముందున్నాడు. కానీ, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్ ఖాన్‌ వరుస హిట్లతో దూసుకుపోతోంటే షారూక్‌ మాత్రం వెనుకబడ్డాడు. అతను సరైన విజయం రూచి చూసి ఆరేళ్లు అవుతోంది. 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత అతనికన్నీ ఫాపులే ఎదురయ్యాయి. దిల్‌వాలే, ఫ్యాన్‌, డియర్ జిందగీ, రయూస్‌, జీరో అన్ని బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక, ఏడాదికో సినిమా విడుదల చేస్తూ దూసుకెళ్లే షారూక్‌ వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతోంది.

    Also Read: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ?

    చివరగా 2018లో జీరో సినిమా చేశాడు షారూక్‌. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కూడా ఫెయిలవడంతో తీవ్ర నిరాశ చెందిన కింగ్‌ ఖాన్‌ కొంత విరామం తీసుకున్నాడు. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ఇంకా మొదలుపెట్టలేదు. అయితే, ఎలాగైనా హిట్‌ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్న షారూక్‌… తాజాగా తన పాత చిత్రం సీక్వెల్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగని అదేదే హిట్‌ సినిమా కాదు. ఓ ఫ్లాప్‌ మూవీ. 2017లో రిలీజై ఫెయిలైన ‘రయీస్‌’ కు సీక్వెల్‌ తీయాలని షారూక్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. 1980ల నాటి గుజరాత్‌ లిక్కర్ దందా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రయీస్‌లో కథ, హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా బాగుంది. కానీ, కథను దర్శకుడు అర్థవంతంగా చెప్పలేకపోపోవడంతో సినిమా ఫ్లాప్‌ అయింది. అయినా కొన్ని వర్గాల వారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే, తనకు ఎంతగానో నచ్చిన ‘రయీస్‌’కు సీక్వెల్‌ తీయాలని షారూక్‌ కోరుకుంటున్నాడు. తమిళ్‌లో వరుస హిట్లు తీసిన అట్లీ కుమార్ తో షారూక్‌ ఓసినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చేది రయూస్‌ సీక్వెలే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ హీరోగా తేరి, మెర్సల్‌, బిగిల్‌ వంటి హిట్‌ చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న అట్లీకి మాస్‌ చిత్రాలు కొట్టిన పిండి. కాబట్టి రయూస్‌ సీక్వెల్‌ బాధ్యత అతనికి అప్పజెప్పాలని షారూక్‌ భావించాడని, దీనిపై తొందర్లోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా ఫ్లాప్ సినిమా సీక్వెల్‌తో అయినా షారూక్‌ ఫేట్‌ మారుతుందేమో చూడాలి.