https://oktelugu.com/

గుడ్‌న్యూస్‌ చెప్పిన కోహ్లీ.. తల్లి కాబోతున్న అనుష్క

భారత్ క్రికెట్‌ జట్టు విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్ అనుష్క శర్మ దంపతులు శుభవార్త చెప్పారు. తొందర్లోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపారు. గర్భంతో ఉన్న అనుష్కతో దిగిన ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్‌ చేసిన విరాట్‌ ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తాము ముగ్గురం అయ్యామని, 2021 జనవరిలో అనుష్క తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నదని చెప్పాడు. ఈ లెక్కన అనుష్క నాలుగు నెలల గర్భంతో ఉంది. మే నెలలోనే ఆమె గర్భం దాల్చినా ఆ విషయాన్ని ఇద్దరూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 27, 2020 / 01:53 PM IST
    Follow us on


    భారత్ క్రికెట్‌ జట్టు విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్ అనుష్క శర్మ దంపతులు శుభవార్త చెప్పారు. తొందర్లోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపారు. గర్భంతో ఉన్న అనుష్కతో దిగిన ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్‌ చేసిన విరాట్‌ ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. తాము ముగ్గురం అయ్యామని, 2021 జనవరిలో అనుష్క తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నదని చెప్పాడు. ఈ లెక్కన అనుష్క నాలుగు నెలల గర్భంతో ఉంది. మే నెలలోనే ఆమె గర్భం దాల్చినా ఆ విషయాన్ని ఇద్దరూ రహస్యంగా ఉంచారు.

    Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

    అనుష్కతో దాదాపు నాలుగేళ్లు డేటింగ్‌ చేసిన విరాట్‌ 2017 డిసెంబర్11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో ఒక్కటైన ఈ జంట.. అనంతరం ఇండియాలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఇచ్చింది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, సీని, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అప్పటి నుంచి కోహ్లీ, అనుష్క జంట పవర్ఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. గతంలో చాలా మంది క్రికెటర్లు.. బాలీవుడ్‌ తరాలను పెళ్లి చేసుకున్నా.. ఈ జోడీకి ఉన్న క్రేజ్‌ మరెవరికీ లేదు. ప్రేయసిగా ఉన్నప్పుడే కోహ్లీ ఆటను చూసేందుకు స్టేడియాలకు వచ్చిన అనుష్క… పెళ్లయ్యాక విదేశీ పర్యటనలకు అతనితో కలిసి వెళ్తోంది.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

    ఐపీఎల్‌ 2020 సీజన్‌ కోసం విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. అనుష్క కూడా అతనితో కలిసి దుబాయ్‌ వెళ్లిందని అంటున్నారు. వచ్చే నెల 19న మొదలయ్యే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును కోహ్లీ నడిపించనున్నాడు. నవంబర్ 10 తేదీన ఈ టోర్నీ ముగియనుంది. ఆ తర్వాతే విరాట్‌ ఇండియాకు తిరిగి రానున్నాడు. మరోవైపు కొంతకాలంగా కొత్త సినిమాలు అంగీకరించని అనుష్క శర్మ తన ప్రొడక్షన్‌ హౌజ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అనుష్క ప్రొడ్యూసర్గా ఈ మధ్యే వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌ పాతాల్‌లోక్‌కు మంచి పేరొచ్చింది. కాగా, తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన కోహ్లీ, అనుష్కలకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    https://twitter.com/imVkohli/status/1298856026544906240

    Tags