అమరావతిలో భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను మీడియాలో ప్రచురించకూడదనడంతో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యంపై అనుమానాలు తలెత్తాయి.
Also Read: అరెస్టు చేయవద్దు.. ఆ టీడీపీ నేతకు హైకోర్టులో ఊరట
అమరావతి భూ కుంభకోణం కేసులో.. బాబు పాలనలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తోపాటు స్వతంత్ర వ్యవస్థలో అత్యున్నత స్థానంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సంబంధించిన ఇద్దరు కూతుళ్ల పేర్లు ఆ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. అయితే.. ఆ కేసు వివరాలు మీడియాలో రాకూడదనే హైకోర్టు ఇలా నిషేధం విధించినట్లు న్యాయ కోవిదులు, ప్రజాస్వామిక వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ద వైర్ అనే ప్రముఖ వార్తా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ సిద్ధార్థ్ వరదరాజన్ అభిప్రాయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మీడియా భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసే, సమాచారాన్ని ప్రజలకు చేరవేసే హక్కును తుంగలో తొక్కడంపై ఆయన ఆవేదన చెందారు. ‘ఏపీ భూ కుంభకోణాల ఎఫ్‌ఐఆర్‌కు నివాళి. ఈ ఎఫ్‌ఐఆర్ కొద్ది సేపే జీవించినా సరే ప్రయోజనకరంగా బతికింది. రోజూ వేలాది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతాయి. కానీ ఈ ఎఫ్‌ఐఆర్‌ను తొక్కిపెట్టేశారు. మీడియాలో రిపోర్ట్ చేయనివ్వలేదు. దానిపై దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపై ఎప్పుడు ఎలా దర్యాప్తు చేయాలన్నది నిర్ణయిస్తున్న వారే భారతదేశంలో అసలైన అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read: కలకలం: ఏపీలో హిందుత్వంపై మరో దాడి
హైకోర్టు తీరు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేలా ఉండడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది ఎఫ్ఐఆర్‌లు దాఖలు అవుతుంటాయి. కానీ ఈ ఒక్క ఎఫ్ఐఆరే ఎందుకు వివాదాస్పదమైంది? ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా ఆదేశాలుండడమేనా అనే చర్చ నడుస్తోంది.