https://oktelugu.com/

అరెస్టు చేయవద్దు.. ఆ టీడీపీ నేతకు హైకోర్టులో ఊరట

మంత్రి కొడాలి నానిని దూషించిన తెలుగుదేశం యువత విభాగం నేత నాదెండ్ల బ్రహ్మయ్యకు ఊరట లభించింది. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పువచ్చింది. నాదెండ్ల బ్రహ్మయ్యను అరెస్టు చేయ‌వ‌ద్దని, ఆయ‌న‌పై ఎలాంటి బ‌ల‌వంత‌పు చర్యల‌కూ దిగ‌వ‌ద్దని హైకోర్టు గుడివాడ వ‌న్ టౌన్ పోలిసుల‌కు ఆదేశాలు ఇచ్చింది. Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్? బ్రహ్మయ్య ఇటీవల మంత్రిని దూషించడంతోపాటు, వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ కార్యకర్తలనూ విమర్శిస్తూ వీడియోలు పెట్టారు. ఆ వీడియోల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 10:37 AM IST
    Follow us on

    మంత్రి కొడాలి నానిని దూషించిన తెలుగుదేశం యువత విభాగం నేత నాదెండ్ల బ్రహ్మయ్యకు ఊరట లభించింది. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పువచ్చింది. నాదెండ్ల బ్రహ్మయ్యను అరెస్టు చేయ‌వ‌ద్దని, ఆయ‌న‌పై ఎలాంటి బ‌ల‌వంత‌పు చర్యల‌కూ దిగ‌వ‌ద్దని హైకోర్టు గుడివాడ వ‌న్ టౌన్ పోలిసుల‌కు ఆదేశాలు ఇచ్చింది.

    Also Read: 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?

    బ్రహ్మయ్య ఇటీవల మంత్రిని దూషించడంతోపాటు, వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ కార్యకర్తలనూ విమర్శిస్తూ వీడియోలు పెట్టారు. ఆ వీడియోల్లో అత్యంత అనుచిత‌మైన భాష‌ను ఉప‌యోగించ‌డంపై వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై ఎలాంటి చ‌ర్యలూ తీసుకోకూడ‌ద‌ని నాదెండ్ల బ్రహ్మయ్య హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ మేర‌కు హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన‌ట్టుగా స‌మాచారం.

    బ్రహ్మయ్యపై ఫిర్యాదు రావడంతో.. తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌ కూడా ఈ మధ్య కార్యకర్తలకు ట్వీట్‌ ద్వారా పిలుపునిచ్చారు. నాదెండ్ల బ్రహ్మయ్యను కాపాడుకోవాలని సూచించారు. అనాగ‌క‌రిక‌మైన భాష‌ను ఉప‌యోగించి రాజ‌కీయ ప్రత్యర్థుల‌ను దూషించిన ఆ తెలుగుదేశం నేత‌ను సేవ్ చేసుకోవాలంటూ పార్టీకి పిలుపునిస్తూ ట్వీట్లు చేశారు. తమ్ముళ్ల పోరాటంతో చివరికి హైకోర్టు తీర్పు బ్రహ్మయ్యకు అనుకూలంగా వచ్చింది.

    Also Read: అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

    ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా నువ్వా నేనా అన్నట్టుగా యుద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికార బలం ప్రయోగిస్తుండగా.. టీడీపీ హైకోర్టు ద్వారా తప్పించుకుంటోంది. ఈ పరిణామం ఏపీలో ఆసక్తి రేపుతోంది.