శతాబ్దకాలం నాటి పద్దతిలోనే కరోనాకు చికిత్స

ప్రపంచాన్ని కలసి వేస్తున్న కరోనా వైరస్ తగిన చికిత్స కోసం ఒక వంక శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తుంటే శతాబ్దకాలం క్రితం ఇటువంటి పరిస్థితులలో అనుసరించిన పద్ధతితోనే ఈ మరణాంతక వ్యాధిని కట్టడి చేయవచ్చని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కరోనాను ఎదుర్కోగలిగే వాక్సిన్లు, యాంటివైరల్ మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు.   ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, చికిత్స అందించే కీలకమైన అంశం ఉందని జాన్స్ హాప్ […]

Written By: Neelambaram, Updated On : March 16, 2020 6:07 pm
Follow us on

ప్రపంచాన్ని కలసి వేస్తున్న కరోనా వైరస్ తగిన చికిత్స కోసం ఒక వంక శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తుంటే శతాబ్దకాలం క్రితం ఇటువంటి పరిస్థితులలో అనుసరించిన పద్ధతితోనే ఈ మరణాంతక వ్యాధిని కట్టడి చేయవచ్చని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కరోనాను ఎదుర్కోగలిగే వాక్సిన్లు, యాంటివైరల్ మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు.
 
ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, చికిత్స అందించే కీలకమైన అంశం ఉందని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కోనే మందు ‘కన్వాలెసెంట్ సీరమ్’లో ఉందని అంటున్నా.రు
వైరస్ వల్ల ఇన్ ఫెక్ట్ అయిన వాళ్ల రక్తం నుంచి తీసిన సీరమ్ నే కన్వాలెసెంట్ సీరమ్ అంటారు. రక్తంలోని ప్లాస్మాలో ఉండే పదార్థమే సీరమ్. దీనిలోనే మన యాంటీబాడీలు ఉంటాయి. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానితో పోరాడడానికి యాంటిబాడీలు ఈ సీరమ్ లోనే విడుదల అవుతాయి.
అందుకే కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సీరమ్ నుంచి వైరస్ కు వ్యతిరేకంగా పోరాడగలిగే యాంటిబాడీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించవచ్చన్నది పరిశోధకులు భావిస్తున్నారు.
1918లో స్పానిష్ ఫ్లూ ఇలాగే ఎపిడెమిక్ వ్యాధిగా పుట్టుకొచ్చింది. అప్పుడు ఆ వ్యాధినుంచి కోలుకున్న వాళ్ల రక్తంలోని అంశాలను ఎక్కించడం వల్ల తీవ్రస్థాయి అనారోగ్యంతో ఉన్న రోగుల మరణాలు 50 శాతానికి పడిపోయాయి. కొన్ని దశాబ్దాల క్రితం తట్టు, పోలియో లాంటి వ్యాధులను అరికట్టడంలో కూడా ఈ పద్ధతినే ఉపయోగించారు.
అయితే 1950లలో ఆధునిక వ్యాక్సిన్లు, యాంటివైరల్ మందులు అభివృద్ధి చెందిన తరువాత ఈ తరహా చికిత్స మరుగున పడిపోయిందని చెప్పారు జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అర్ టురో కెసాడ్వాల్.
ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి పెరుగుతుండడంతో మళ్లీ ఈ చికిత్సను అభివృద్ధి చేయడం మంచి ఫలితాలను ఇవ్వగలదని ఆయన భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలంలో ఏ వ్యాక్సిన్లూ లేవు. కాని వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తీసుకున్న కణాలే ఆయా సూక్ష్మజీవుల అంతుచూశాయి.