
ఈ ఏడాది తెలుగు యువ హీరోలకు పెళ్లి మీద మనసు మళ్లింది.దాంతో ఇద్దరు యువ హీరోలు ఒకే రోజు పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 న ఆ ఇద్దరు పెళ్లి కి రెడీ అయ్యారు.
వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది హీరో నితిన్.ఈ యువ హీరో థర్టీ ప్లస్ దాటి ఆరేళ్ళు అవుతుంది. పెళ్లి పీటలు ఎక్కుదామని నితిన్ సిద్దమైన వేళ కరోనా రూపంలో పెళ్ళికి అడ్డంకి వచ్చి చేరింది. నితిన్ తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం కూడా చేసుకున్నాడు. వీరి వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో గ్రాండ్ గా జరగాల్సివుంది. కానీ దుబాయ్ కూడా కరోనా ప్రభావిత దేశాలలో ఉండడంతో పాటు, ఆ దేశం యొక్క ప్రభుత్వం ఇతర దేశాల నుండి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనితో నితిన్ మ్యారేజ్ సందిగ్ధంలో పడింది. నితిన్ పెళ్లిపై కుటుంబ సభ్యులను వాకబు చేయగా ఏప్రిల్ పదహారున పెళ్లి చేయాలా వాయిదా వెయ్యాలా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదు అన్నారట ..
ఇక ఏప్రిల్ పదహారున పెళ్ళికి రెడీ అవుతున్న రెండో యంగ్ హీరో నిఖిల్. గతేడాది అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫామ్ అందుకున్న ఈ యువ హీరో మంచి జోష్ మీద ఉన్నాడు. అదే ఊపులో తన సంతోషం మరింత రెట్టింపయ్యేలా ఇటీవలే ఫిబ్రవరి 1న తన స్నేహితురాలు పల్లవితో నిఖిల్ కు నిశ్చితార్ధం కూడా అయ్యింది. ఆ క్రమంలో ఏప్రిల్ 16న పెళ్ళికి వీరిద్దరూ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇంతవరకూ అంతా సజావుగా జరగ్గా ఇప్పుడు కరోనా వైరస్ భయం వల్ల పెళ్ళికి అడ్డంకి వచ్చింది.పెళ్లి విషయం లో ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే నిఖిల్ ను మీడియా కలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెళ్లి వాయిదా వేసే ఉద్దేశమేమైనా ఉందా అని అడగ్గా తనకు అలాంటి ఉద్దేశమేమి లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి వాయిదా పడదని తెలిపాడు. అవసరమైతే గుళ్లో అయినా పెళ్లి చేసుకుంటాం కానీ పెళ్లి వాయిదా అయితే వెయ్యమని తేల్చి చెప్పేసాడు. marriages are made in heaven