https://oktelugu.com/

Hyderabad Traffic restrictions : హైదరాబాద్ వాసులకు బీఅలెర్ట్.. ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి

Hyderabad Traffic restrictions : అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ సమాయత్తమైంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రెడీ చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం తీర్చిదిద్దింది. ఈ విగ్రహా ఆవిష్కరణను రేపు ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించనుంది. ఈ అంబేద్కర్ జయంతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, నాయకులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 1 […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2023 / 10:58 PM IST
    Follow us on

    Hyderabad Traffic restrictions : అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ సమాయత్తమైంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రెడీ చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం తీర్చిదిద్దింది. ఈ విగ్రహా ఆవిష్కరణను రేపు ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించనుంది.

    ఈ అంబేద్కర్ జయంతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, నాయకులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

    శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ మార్గాల్లో వాహనాలు దారి మళ్లించనున్నారు. ప్రధానంగా నెక్లస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. నెక్లస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ , తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు అనుమతి లేదు.

    ఈ రూట్లకు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ప్రత్యామ్మాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

    -పంజాగుట్ట+సోమాజీగూడ+ఖైరతాబాద్ నుంచి నెక్లస్ రోడ్ వాహనాలు షాదాన్ కాలేజీ మీదుగా మళ్లించారు. సంజీవయ్యపార్క్, నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా మళ్లించారు. లక్డీకపూల్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. ట్యాంక్ బండ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.

    ప్రధానంగా మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోడ్ మార్గాలు పూర్తిగా మూసివేస్తారు. ఎన్టీఆర్ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్క్ లు మూసివేశారు.

    వాహనదారులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియాను అనుసరించాలని.. ఏదైనా అత్యవసరమైతే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నంబర్ 3010203626 కు ఫోన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.