
Pooja Hegde : హీరోయిన్ పూజా హెగ్డే లేటెస్ట్ లుక్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె టాప్ కొంచెం వెరైటీగా ఉంది. ప్యాంటేమో బాగా వదులైంది. అలాగే సైజు ఎక్కువైంది. టాప్ ఏమో చాలీ చాలనట్లు ఉంటే, ప్యాంటు మాత్రం… ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. దీంతో నెటిజెన్స్ ట్రోల్స్ కి తెగబడ్డారు. అది జాకెట్టా లేకా బ్రా నా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో నీ సైజు ప్యాంటు దొరకలేదా? అని సెటైర్స్ వేస్తున్నారు. పూజా లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫర్హాన్ సామ్జీ దర్శకత్వం వహించారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ తమిళ చిత్రం వీరమ్ రీమేక్. టాలీవుడ్ స్టార్ వెంకటేష్ కీలక రోల్ చేయడం విశేషం. పూజా హెగ్డే వెంకీ చెల్లెలుగా నటిస్తున్నారు. ఆమె తెలుగు అమ్మాయి పాత్ర చేస్తుంది.

ట్రైలర్ లో పూజా హెగ్డే తెలుగు డైలాగ్స్ చెప్పడం మనం చూడొచ్చు. 2022లో వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ పూజా హెగ్డే సల్మాన్ మూవీతో ట్రాక్ లోకి రావాలనుకుంటున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పూజా హెగ్డే విరివిగా పాల్గొంటున్నారు. పూజా హెగ్డే గత ఏడాది నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ వరుసగా పరాజయం పాలయ్యాయి. లక్కీ హీరోయిన్ ట్యాగ్ కాస్తా ఐరన్ లెగ్ గా మారింది. దీంతో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఫలితం కోసం పూజా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ప్రసుత్తం పూజా చేస్తున్న ఏకైన తెలుగు చిత్రం ఎస్ఎస్ఎంబి 28. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ మరోసారి ఆమెకు అవకాశం ఇచ్చారు. అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్, పూజా హెగ్డేలతో విడివిడిగా త్రివిక్రమ్ కి హ్యాట్రిక్ చిత్రం కావడం విశేషం. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు తన కెరీర్ నిలబెడతాయని పూజా గట్టిగా నమ్ముతుంది.
