https://oktelugu.com/

హైద్రాబాద్ లో ట్రాఫిక్ జామ్.. కారణాలు ఇవే!

  హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగింది. అందుకు ప్రధానంగా రెండు కారణాలు.. ఒకటి పలు ప్రాంతాలలో లాక్‌ డౌన్‌ సందర్భంగా గత 45.రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు, అయితే రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. దింతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అదేసమయంలో లాక్ డౌన్ 3.0 లో కొన్ని రంగాలకు సడలింపులు ఇవ్వడంతో వాహనదారులు భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చారు. ఈ రెండు కారణాలతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 8, 2020 / 07:42 PM IST
    Follow us on

     

    హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగింది. అందుకు ప్రధానంగా రెండు కారణాలు.. ఒకటి పలు ప్రాంతాలలో లాక్‌ డౌన్‌ సందర్భంగా గత 45.రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు, అయితే రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. దింతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అదేసమయంలో లాక్ డౌన్ 3.0 లో కొన్ని రంగాలకు సడలింపులు ఇవ్వడంతో వాహనదారులు భారీ స్థాయిలో రోడ్లపైకి వచ్చారు. ఈ రెండు కారణాలతో హైద్రాబాద్ రోడ్లు ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. ఈ నెల 6వ తేదీ నుంచి వైన్‌ షాపులతో పాటు, నిర్మాణ, కిరాణా తదితర వ్యాపారాలకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దింతో మద్యం ప్రియులు, చిన్న, చితక వ్యాపారులు రోడ్ల పైకి రావడంతో రాజధానిలో ట్రాఫిక్ జామ్ అయ్యిడోచ్చని పోలీసులు భావిస్తున్నారు.

    లాక్ డౌన్ కారణంగా పోలీసులు సీజ్ చేసిన వాహనాలను విడిపించుకునేందుకు జరిమానా డబ్బులను పేటీఎం, ఫోన్‌ పే, మీ సేవ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. ఇక ఎపిడమిక్‌ డిసీస్‌ యాక్ట్‌ కింద పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలను మాత్రం కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో పోలీసులు కూడా సీజ్‌ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 1.60 లక్షల వాహనాలను సీజ్‌ చేశారు. ఇందులో సివిల్‌ పోలీసులు లక్షకు పైగా, ట్రాఫిక్‌ పోలీసులు మరో 50 వేల వరకు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తాజా నిర్ణయంతో వాహన దారులకు భారీ ఊరట లభించింది.