Tom Tom Traffic Index :సాధారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే.. హైదరాబాద్ అని చెబుతారు. ఇది మన రాష్ట్రంలో మరి ప్రపంచంలో అంతకుమించిన ట్రాఫిక్ రద్దీగా ఉండే నగరం ఉంది. టామ్ టామ్ ఇండెక్స్ 2023 తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ నగరం గురించి వివరించింది. బ్రిటన్ లో ఉండే లండన్ నగరంలో ప్రయాణించాలంటే ఇబ్బందులు తప్పవని గుర్తించింది. ఇక్కడ 10 కిలోమీటర్లు ప్రయాణించాలటే 37 నిమిషాల సమయం పడుతుందట. ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు 14 కిలోమీలర్లు. లండన్ తరువాత అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాలు ఏవంటే?
అమ్ స్టర్ డామ్ కు చెందిన లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్ టామ్ ఇండెక్స్ 2023 ప్రకారం.. లండన్ తరువాత ట్రాఫిక్ తో అత్యంత రద్దీగా ఉండే రోడ్లు ఐర్లాండ్ లోని డబ్లిన్, కెనడాలోని టోరంటోలు ఉన్నాయి. ప్రపంచంలోని 55 దేశాల్లో సర్వే చేయగా 387 నగరాల్లోని సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు టామ్ టామ్ ఇండెక్స్ తెలిపింది. ఇందులో భాగంగా ఇంధన ఖర్చులు, కార్బన్ డైయాక్సైడ్ ఉద్ఘారాలను అంచనా వేసిట్లు తెలుపుతోంది.
టామ్ టామ్ నివేదించిన జాబితాలలో భారత్ కు చెందిన బెంగుళూరు 6వ స్థానం, పూణె 7వ స్థానంలో నిలిచాయి. బెంగుళూరులో 10 కిలోమీటర్లకు 28 నిమిషాలు, పూణెలో 27 నిమిషాల 50 సెకన్లు పడుతుంది. గతేడాది కంటే ఈ సమయం పెరగడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీ ఈ నివేదికలో 44వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 21 నిమిషాల 40 సెకన్లు, ముంబైలో 21 నిమిషాల 20 సెకన్లు పట్టిందని టామ్ టామ్ ఇండెక్స్ తెలిపింది.
టామ్ టామ్ నివేదిక ప్రకారం ప్రపచంలో ట్రాఫిక్ అధికంగా ఉన్న నగరాల్లో మొదటిస్థానంలో లండన్, ఆ తరవాత వరుసగా డబ్లిన్, టోరంటో, మిలాన్, లిమా, బెంగళూరు, పూణె, బుచారెస్ట్, మనీలా, బ్రస్సల్స్ ఉన్నాయి. దేశంలో వాహనాల వినియోగం పెరుగుతున్నందున ట్రాఫిక్ రద్దీ విపరీతమవుతోంది.