Tollywood vs AP govt: గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు టాలీవుడ్ సినీ ప్రముఖులు బయటకు చెప్తున్నారు. కానీ, లోపల మాత్రం జగన్ సర్కారు నిర్ణయాలపైన విమర్శలు చేస్తున్నారు. ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్‌తో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఈ వ్యవస్థ గురించి ఏపీ సర్కారు ఏమంటోంది, టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు ఏం చెప్తున్నారు.. అనే విషయాలపై స్పెషల్ ఫోకస్..

ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీలోని థియేటర్స్ టికెట్ ధరలు భారీగా తగ్గిపోయాయి. బెన్‌ఫిట్ షోస్‌ను కూడా ఏపీ సర్కారు రద్దు చేసింది. కాగా, ఈ విషయమై ఇంకా సమగ్రమైన చర్చ జరగాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ మేరకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ కూడా చేశారు. ఏపీ మంత్రులు సైతం చర్చలకు సిద్ధం అన్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఈ విషయాలన్నీ సీఎం జగన్‌కు విన్నవిస్తామని అన్నారు. ఈ నేఫథ్యంలోనే తాజాగా ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేవారు. టికెట్ ప్రైసెస్ తగ్గించి ప్రజలకు మేలు చేశామని ఏపీ సర్కారు భావిస్తున్నదని, కానీ, ప్రొడ్యూసర్‌గా తన ప్రొడక్ట్‌కు తాను ప్రైస్ నిర్ణయించుకునే వెసులుబాటు ఉండాలి కదా అని అన్నారు.
టికెట్స్ ప్రైస్ తగ్గించడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ అసంతృప్తి వ్యక్తం చేస్తోందని, ఈ నిర్ణయంతో ఇండస్ట్రీ సంతోషంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. టికెట్ల ధర ఇంతలా తగ్గించడం సరికాదని, ఈ విషమయై తాము జగన్ సర్కారుకు మరోసారి రిక్వెస్ట్ చేస్తామని అంటున్నారు.
మరో ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ కూడా ఈ విషయమై స్పందించారు. ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ మంచిదేనని, కానీ, టికెట్ ప్రైసెస్ తగ్గించడం వల్లే అసలైన సమస్యలు మొదలవుతున్నాయని అన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు బాగున్నాయని, కానీ, ఏపీలోనే పరిస్థితి బాలేదని, ఈ విషయమై ఏపీ ప్రభుత్వంతో చర్చించాలని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు.
Also Read: KA Paul: కేఏ పాల్ తీరే వేరప్పా!
‘అఖండ’ ఫిల్మ్ బెన్‌ఫిట్ షో వేసిన థియేటర్స్‌పై ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. అయితే, ఈ చిత్రం సమస్యలన్నీ అధిగమించుకుని ప్రేక్షకుల ‘అఖండ’ ఆదరణ పొందుతోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్’.. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ‘ఆచార్య’ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు విడుదల అయే లోపు ఏపీ సర్కారుతో చర్చించాలని సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, టికెట్ల ధరల పెంపునకు ఏపీ సర్కారు అనుమతించబోదని ప్రభుత్వ వర్గాలు అనుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. ఏమవుతుందో..
Also Read: Cinema Tickets: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వంపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు