Black box: సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలేంటి? అందరిని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. ప్రమాదానికి అసలు కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకు కూలింది? సాంకేతిక సమస్యలే ఎదురయ్యాయా? లేక వాతావరణ ప్రభావంతోనే ప్రమాదం చోటుచేసుకుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. తొలుత ప్రమాదంపై విశ్లేషణ చేయడానిక వీలు లేకుండా పోయింది. దీంతో గురువారం ప్రమాదానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి ముప్పై అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. అనంతరం దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అందులోని సమాచారంతో హెలికాప్టర్ కూలిపోయే సమయంలో బిపిన్ రావత్ ఏం మాట్లాడారు? పైలట్ తో ఏం చర్చించారు? అనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. దీంతో ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ తో పాటు మూడు ఇతర వస్తువులు కూడా దొరికాయి.
హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కు ఎందుకు జరిగింది? బ్లాక్ బాక్స్ లో ఏం సమాచారం ఉంటుంది? ప్రమాద సమయంలో ఏటీసీతో సంబంధాలు ఉన్నాయా? తెగిపోయాయా? అనే విషయాలు వెల్లడయ్యే వీలుంది. దీంతో వాటిని ఢిల్లీకి లేదా బెంగుళూరుకు పంపే అవకాశముంది. దీంతో అందులో ఉన్న సమాచారం తెలిసే సూచనలున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ ను డీకోడింగ్ చేస్తే అన్ని విషయాలు అర్థమవుతాయని చెబుతున్నారు.
Also Read: Saiteja: అంచెలంచెలుగా ఎదిగిన సాయితేజ.. ‘రావత్’ను మెప్పించాడు?
మరోవైపు సంఘటన స్థలాన్ని ఉన్నతాధికారుల పరిశీలించారు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి పరిశీలించారు. డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి సంఘటన స్థలంలో ఫోరెనిక్స్ నిపుణులతో ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలని సూచించారు.
Also Read: Google Year in Search 2021: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వీరి కోసమే వెతికారు..వారు ఎవరంటే?