Movie Ticket Rates: తూచ్ తొండాట.. చెడ్డపేరు జగన్ కు.. టిక్కెట్ల కాసులు మాత్రం సినీ పెద్దలకా?

Movie Ticket Rates: వ్రతం చెడ్డా ఏపీ సీఎం జగన్ కు ఫలితం దక్కకుండా తయారవుతోందట.. ఎంతైనా సినిమావోళ్లు కదా.. మాట మీద నిలబడడం కష్టమేనంటున్నారు. జగన్ ఎన్ని జీవోలు తెచ్చినా.. రూ.100కే సినిమా చూపించాలన్నా ఆ రేటుకు అమ్మడం కష్టమేనంటున్నారు. ఈ క్రమంలోనే జీవోలను పక్కనపెట్టి బ్లాక్ మార్కెట్ లో.. తెరవెనుక సైలెంట్ గా అయినా  రేట్లు పెంచి దండుకునేలా సినీ పెద్దలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డిసెంబర్ నెలలో అఖండ, పుష్ప […]

Written By: NARESH, Updated On : November 30, 2021 3:03 pm
Follow us on

Movie Ticket Rates: వ్రతం చెడ్డా ఏపీ సీఎం జగన్ కు ఫలితం దక్కకుండా తయారవుతోందట.. ఎంతైనా సినిమావోళ్లు కదా.. మాట మీద నిలబడడం కష్టమేనంటున్నారు. జగన్ ఎన్ని జీవోలు తెచ్చినా.. రూ.100కే సినిమా చూపించాలన్నా ఆ రేటుకు అమ్మడం కష్టమేనంటున్నారు. ఈ క్రమంలోనే జీవోలను పక్కనపెట్టి బ్లాక్ మార్కెట్ లో.. తెరవెనుక సైలెంట్ గా అయినా  రేట్లు పెంచి దండుకునేలా సినీ పెద్దలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

tollywood-celebs-meet-andhra-pradesh-cm-ysr-jagan-mohan-reddy 2

ఈ డిసెంబర్ నెలలో అఖండ, పుష్ప లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి. వాటి కలెక్షన్లు చూశాక వచ్చే సంక్రాంతి రేసులో నిలబడ్డ ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ల విడుదల గురించి ఆలోచించాలని సినీ పెద్దలు అనుకుంటున్నారట..

ఈ క్రమంలోనే సీఎం జగన్ రూ.100కే టిక్కెట్, బెనిఫిట్, ప్రీ షోలు లేవని చెబుతున్నా.. గుట్టు చప్పుడు కాకుండా షోలు వేసి దండుకునే ప్లాన్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమావాళ్లు జగన్ సర్కార్ ఆదేశాలను పట్టించుకునే పరిస్థితిలో లేరనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఏపీ వ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలయ్య చిత్రం ‘అఖండ’కు అప్పుడే తెల్లవారుజామున ఫ్యాన్స్ షోలు, స్పెషల్ షోలు అంటూ టిక్కెట్లను భారీ రేట్లకు అమ్మేస్తున్నారట.. దీంతో జగన్ కఠిన నిర్ణయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని క్షేత్రస్తాయిని బట్టి తెలుస్తోంది.

Also Read: పవన్ ఆవేశానికి పెద్దల సంకెళ్లు… కారణం అదేనా?

ఏపీలో సినిమా షోలను పర్యవేక్షించే అధికారులకు ఈ స్పెషల్ షోలపై ప్యాకేజీలు, లంచాలు ఇచ్చి మరీ వేసేందుకు సినీ డిస్ట్రిబ్యూటర్లు రెడీ చేసుకున్నట్టు భోగట్టా. దాంతో రూ100 రేటు అన్నది అమలు కాదని తేలిపోయింది. తమకిష్టమైన రేట్లకు ఈ షోలకు టికెట్లను అమ్మేస్తున్నారట..

అయితే జగన్ మొండి పట్టుదలతో అందరి దృష్టిలో విలన్ అయ్యారు. ఆయన ఆదేశాలు అమలు కావడంలేదు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సినీ ఇండస్ట్రీ స్పెషల్ షోలకు సహకరిస్తున్నారట.. స్వయంగా కీలక మంత్రి కూడా సినీ పెద్దలతో ‘కానివ్వండయ్యా’ అంటూ భరోసానిచ్చినట్టు ప్రచారం సాగుతోంది.  దీంతో సినిమాలు విడుదల చేసే వారు ముందస్తు షోలు, అడ్డగోలు టిక్కెట్లు రేట్లతో రెచ్చిపోవడానికి రెడీ అయ్యారట.. అంటే పైకి మాత్రం చెడ్డ పేరు జగన్ కు.. కాసులు మాత్రం సినీ ఇండస్ట్రీకి తోడవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ మాత్రం దానికి జగన్ సినీ ఇండస్ట్రీపై ఇన్ని ఆంక్షలు పెట్టడం ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది.

Also Read: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం సమంజసమేనా?