Lakshya Movie: నాగశౌర్య “లక్ష్య” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న విక్టరీ వెంకటేశ్…

Lakshya Movie: ఊహలు గుసగుసలాడే ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందారు యంగ్ హీరో నాగ శౌర్య. ఆ తర్వాత వచ్చిన “చలో” చిత్రంతో అమ్మాయిల హృదయాలను సొంతం చేసుకున్నారు ఈ హీరో. అయితే నాగ సౌర్య ఖాతాలో ఇప్పటివరకు సూపర్ హిట్ లేదని చెప్పాలి. ఇటీవల విడుదలైన “వరుడు కావాలి” చిత్రంతో ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నారు ఈ కుర్రోడు. ప్రస్తుతం లక్ష్యం సినిమాతో థియేటర్ లో సందడి చేయనున్నారు. Also Read: అక్కినేని నాగార్జున […]

Written By: Raghava Rao Gara, Updated On : November 30, 2021 2:45 pm
Follow us on

Lakshya Movie: ఊహలు గుసగుసలాడే ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందారు యంగ్ హీరో నాగ శౌర్య. ఆ తర్వాత వచ్చిన “చలో” చిత్రంతో అమ్మాయిల హృదయాలను సొంతం చేసుకున్నారు ఈ హీరో. అయితే నాగ సౌర్య ఖాతాలో ఇప్పటివరకు సూపర్ హిట్ లేదని చెప్పాలి. ఇటీవల విడుదలైన “వరుడు కావాలి” చిత్రంతో ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నారు ఈ కుర్రోడు. ప్రస్తుతం లక్ష్యం సినిమాతో థియేటర్ లో సందడి చేయనున్నారు.

Lakshya Movie

Also Read: అక్కినేని నాగార్జున “బంగార్రాజు” సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే…

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఏసియా సునీల్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ ఏడాది డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని కూడా మొదలు పెట్టేశారు చిత్ర బృందం.ఇందులో నాగశౌర్య విలుకాడుగా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమా కోసం జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి ప్రత్యేకించి సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేశారు నాగశౌర్య. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ , సింగిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 1న విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా లాంఛ్ చేయబోతున్నారట. జగపతిబాబు ,సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రను పోషిస్తున్నారు.ఈ సినిమా కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Also Read: 83 సినిమా తెలుగు ట్రైలర్ విడుదల… గూస్ బంప్స్ గ్యారంటీ