20 నుంచి టోల్ వసూళ్లు ప్రారంభం!

గత నెల రోజుల నుంచి నిలిచిపోయిన టోల్ వసూళ్లు మళ్లీ ప్రారంభించడానికి టోల్ గెట్ ల సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 1:41 pm
Follow us on


గత నెల రోజుల నుంచి నిలిచిపోయిన టోల్ వసూళ్లు మళ్లీ ప్రారంభించడానికి టోల్ గెట్ ల సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం టోలు వసూలును నిలిపివేసింది. గత నెల 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాస్తూ ఏప్రిల్ 20 నుంచి టోలు వసూలు మొదలుపెట్టాలని సూచించింది.

కేంద్రం సూచనపై లారీ యజమానుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. నెల రోజులుగా లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలను నిలిపివేయడంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన డ్రైవర్లు, క్లినర్లు డ్యూటీలకు వెళ్లేందుకు ముందుకు రావడం లేదంటున్నారు. ఎందుకు కరోనా భయం కారణంగా యజమానులు చెబుతున్నారు.
ఈ సమయంలో రవాణా రంగానికి ఊతం ఇచ్చే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొంతున్నారు.