సూర్యాపేటకు పోటీగా బెజవాడ!

తెలంగాణాలోని సూర్యాపేటలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్న తరుణంలో ఏపీలోని విజయవాడలో కూడా అదే మొత్తంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సూర్యాపేటలో 16 కేసులు నమోదు కాగా నేడు విజయవాడలో కూడా 16 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు నమోదు కాగా… అందులో నగరంలోని కార్మికనగర్‌ లో 8 కేసులు, ఖుద్దుస్ నగర్, విద్యాధరపురం, గుప్తా సెంటర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరపేట, చోడవరం […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 3:04 pm
Follow us on


తెలంగాణాలోని సూర్యాపేటలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్న తరుణంలో ఏపీలోని విజయవాడలో కూడా అదే మొత్తంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సూర్యాపేటలో 16 కేసులు నమోదు కాగా నేడు విజయవాడలో కూడా 16 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు నమోదు కాగా… అందులో నగరంలోని కార్మికనగర్‌ లో 8 కేసులు, ఖుద్దుస్ నగర్, విద్యాధరపురం, గుప్తా సెంటర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరపేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. బాధితులకు ఎవరి నుంచి వైరస్ సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైరస్ సోకిన వారు నగరంలో ఏయే ప్రాంతాల్లో తిరిగారు, ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

అయితే వీరికి ఎవరి నుంచి వైరస్ సోకిందనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన తరువాత ఇతరులకు సోకిన ఈ వైరస్… ఆ తరువాత మర్కజ్ ప్రార్థనాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా ఇతరులకు సోకినట్టు అధికారులు గుర్తించారు. ఈ కోవలోనే విచారణ చేపట్టి… మిగతావారిని గుర్తించడమో లేక ఇతరులను క్వారంటైన్ చేయడమో చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కరోనా బాధితుల్లో ఎక్కువమందికి విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం లేకపోవడం, మర్కజ్ లింకులు కూడా లేకపోవడంతో… వారికి ఈ మహమ్మారి ఏ రకంగా సోకిందనే అంశం తెలుసుకునేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.