ట్రంప్ కి తలనొప్పిగా మారిన మూడు ట్వీట్లు!

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన మూడు ట్వీట్లు ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ ‌ని వ్యతిరేకిస్తూ ట్రంప్ ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లకు వ్యతిరేకంగా వందలమంది నిరసన కారులు లాక్ డౌన్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేబడుతున్నారు. మిన్నెసోట, మిచిగన్, వర్జీనియా రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ పేరిట అమలు చేస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని, “లిబరేట్ […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 1:38 pm
Follow us on


ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన మూడు ట్వీట్లు ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ ‌ని వ్యతిరేకిస్తూ ట్రంప్ ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లకు వ్యతిరేకంగా వందలమంది నిరసన కారులు లాక్ డౌన్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేబడుతున్నారు.

మిన్నెసోట, మిచిగన్, వర్జీనియా రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ పేరిట అమలు చేస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని, “లిబరేట్ మిన్నెసోట’’, ‘‘లిబరేట్ మిచిగన్’’, ‘‘లిబరేట్ వర్జీనియా’’ అంటూ ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. ట్రంప్ ట్వీట్లు చేసిన రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష డెమొక్రాట్లు పరిపాలిస్తున్న రాష్ట్రాలే కావడం గమనార్హం.

అయితే, ఆయా రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ ‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నిబంధనలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయని, అకారణంగా రాకపోకల్ని నియంత్రిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ పతనానికీ దారితీస్తున్నాయని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. తక్షణం లాక్ ‌డౌన్ ఎత్తేయాలని మిచిగన్, ఓహియో, నార్త్ కరోలినా, మిన్నెసోట, ఉటా, వర్జీనియా, కెంటకీల్లో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.