Homeఎంటర్టైన్మెంట్Aha: అదిరే లెవెల్లో జరుగుతున్న "ఆహా 2.0" వేడుక... ముఖ్య అతిధిగా అల్లు అర్జున్

Aha: అదిరే లెవెల్లో జరుగుతున్న “ఆహా 2.0” వేడుక… ముఖ్య అతిధిగా అల్లు అర్జున్

Aha: ‘ఆహా’… తొలి తెలుగు ఓటీటీ సంస్థ. అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన ఈ సంస్థ ఓటీటీ రంగంలో తనదైన ముద్ర వేసింది. బ్లాక్​బస్టర్​ సినిమాలు, సరికొత్త వెబ్​సిరీస్​లు, టాక్​ షోలు, ఒరిజినల్స్​తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. రోజురోజుకీ సబ్​స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మొత్తంగా ఇప్పటివరకు 50 మిలియన్లకు పైగా యూజర్లు, 13 మిలియన్లకు పైగా డౌన్​లౌడ్స్​తో దూసుకుపోతుంది ఈ ఒటీటీ ఫ్లాట్ ఫామ్.

allu arjun as a chief guest for aha 2.O launch event going on live

ఈ క్రమంలోనే దీపావళి సందడిని మరింత రెట్టింపు చేసేందుకు ఆహా యాప్​ అప్​గ్రేడ్ అవ్వబోతుంది.​ సరికొత్త ఫీచర్స్​ను వీక్షకులకు అందించనుంది. ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​ సమర్పణలో ‘ఆహా 2.0’గా అవతరించనుంది. దీని కోసం గ్రాండ్​గా ‘ఐకాన్​ స్టార్​ ప్రెజంట్స్​ ఆహా 2.0’ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రస్తుతం అధిరే రేంజ్ లో నిర్వహిస్తున్నారు. కాగా కాసేపటి క్రితమే ఈ వేడుక ప్రారంభమైంది. అల్లు అర్జున్​ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలానే ఈ షోకు బన్నీ ప్రజెంటర్​గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. హైదరాబాద్​ నోవాటెల్​ ఈ పండగకు వేదిక కానుంది. అల్లు అరవింద్​, జూపల్లి రాము రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది.

Icon StAAr Presents aha 2.0 | Grand Event Live | Allu Arjun | aha

ఇందులో భాగంగా ‘ఆహా 2.0’ను ప్రారంభించనున్నారు. ఈ 2.0 లాంఛింగ్​ కార్యక్రమంలో… త్వరలో ఆహాలో రానున్న ‘మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్’​, ‘లక్ష్య’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘డీజే టిల్లు’, ‘రొమాంటిక్’​, ‘అనుభవించు రాజా’, ‘పుష్పక విమానం’, ‘గని’ వంటి చిత్రాలకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. అలానే ఆహా ఒరిజినల్స్ గా రూపొందుతున్న ‘అన్​స్టాపబుల్’​, ‘సేనాపతి’, ‘భామా కలాపం’, ‘త్రీరోజెస్’​ వివరాలను కూడా ప్రకటించనున్నారు. మరి ఆహా అప్​డేటెడ్​ వెర్షన్​ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించనుందో తెలియాలంటే ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version