రేవంత్ రెడ్డికి గట్టి షాకిచ్చిన కోదండరాం

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. పార్టీ విధి విధానాలపై త్వరలోనే అంతర్గత సమీక్ష ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. లోపాలను సరిచేసుకుంటామని సూచించారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని కార్యాలయంలో ఆదివారం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీకి […]

Written By: Srinivas, Updated On : July 11, 2021 5:05 pm
Follow us on

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. పార్టీ విధి విధానాలపై త్వరలోనే అంతర్గత సమీక్ష ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. లోపాలను సరిచేసుకుంటామని సూచించారు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ లోని కార్యాలయంలో ఆదివారం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.

ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీకి తమ పార్టీ వ్యతిరేకం అని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో డబ్బులు కుమ్మరించి గెలిచేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ తాపత్రయ పడుతోందని విమర్శించారు. ఆగస్టులో ప్లీనరీ నిర్వహించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

అమరవీరుల ఆశయ సాధనే తమ తొలి ప్రాధాన్యత అన్నారు. అమ్ముడు, కొనుడు రాజకీయాలకు తామూ దూరమని స్పష్టం చేశారు. స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయే రాజకీయాలు టీజేఎస్ చేయదని సూచించారు. ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలు, ఇన్ చార్జీలను నియమిస్తామన్నారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసిన కోదండరామ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. టీజేఎస్ ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీ ప్రస్థానం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు వార్తలు రావడం ఊహాగానాలే అని తేల్చేశారు. ట్రయాంగిల్ ఫైట్ గా కనిపిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో తాము పోటీ చేస్తామని చెప్పారు.

టీఆర్ఎష్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలను తోసిరాజని టీజేఎస్ ప్రభావం చూపుతుందని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తాము ప్రభావం చూపి తీరుతామని దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసి ఓట్లు సాధించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్న వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

నిజానికి కోదండరాం ఇటీవలే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలనుకున్నారు. రేవంత్ రెడ్డి కలిసినప్పుడు వీరి మధ్య చర్చ జరిగిందట.. కానీ రేవంత్ రెడ్డి షాకిస్తూ ఏకంగా హుజూరాబాద్ లో పోటీకి సై అనడం.. కాంగ్రెస్ వర్గాలకు షాకిచ్చినట్టైంది. రేవంత్ ఈ పరిణామం మింగుడపడని వ్యవహారంగా మారింది.