https://oktelugu.com/

ఆ వీడియో షేర్ చేసి కేటీఆర్ ఫిదా చేశాడు

అసలే వానాకాలం.. అందునా తెలంగాణలో హరితహారం.. ఇంకేముంది అంతటా పచ్చని పచ్చలహారం అలుముకుంది. తెలంగాణ అంతటా జోరుగా సాగుతున్న హరితహారంలో కోట్ల మొక్కలు నాటుతున్నారు. వాటితో రహదారులు, ఖాళీ ప్రదేశాలు, అడవులు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఎంతగా పచ్చబడిందో.. ఎంతలా పచ్చలహారంగా మారిందనే దానిపై తాజాగా మంత్రి కేటీఆర్ ఒక వీడియోను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో ‘గ్రీన్ మిషన్’ కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి […]

Written By: , Updated On : July 11, 2021 / 05:13 PM IST
Follow us on

అసలే వానాకాలం.. అందునా తెలంగాణలో హరితహారం.. ఇంకేముంది అంతటా పచ్చని పచ్చలహారం అలుముకుంది. తెలంగాణ అంతటా జోరుగా సాగుతున్న హరితహారంలో కోట్ల మొక్కలు నాటుతున్నారు. వాటితో రహదారులు, ఖాళీ ప్రదేశాలు, అడవులు పచ్చగా కళకళలాడుతున్నాయి.

తెలంగాణ ఎంతగా పచ్చబడిందో.. ఎంతలా పచ్చలహారంగా మారిందనే దానిపై తాజాగా మంత్రి కేటీఆర్ ఒక వీడియోను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో ‘గ్రీన్ మిషన్’ కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలోని 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ కు అనుసంధానంగా ఉన్న 19 ఇంటర్ చేంజ్ లను పచ్చనితోరణంగా మార్చిన దృశ్యాలను కేటీఆర్ వీడియోలో పంచుకున్నారు.

కేటీఆర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఓఆర్ఆర్ కు ఇరువైపులా.. మధ్యలో నాటి మొక్కలు పచ్చదనంతో పూలతో కనువిందు చేశాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల నాటిన మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి.

మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఔటర్ చుట్టూ ఎంత పచ్చదనం అలుముకుందో కళ్లకు కట్టింది.