Telugu News » Ap » Father who jumped in godavari with two children
ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన తండ్రి
ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న విషాద సంఘటనల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు (10) కుమారుడు (9) తో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరొక ఘటనలో విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట వద్ద పెద్దేరు నదిలో […]
ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న విషాద సంఘటనల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు (10) కుమారుడు (9) తో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరొక ఘటనలో విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట వద్ద పెద్దేరు నదిలో స్నానానికి దిగిన ముగ్గురు మృతి చెందారు.