
ఆధ్యాత్మిక తిరుపతిలో ఉప ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల నేతలకు కొత్తకష్టం వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకుండానే ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు కన్ను వేయడంపై అక్కడున్న స్థానిక నేతల్లో వణుకు మొదలైంది. ఇళ్లు అలక్క ముందే పండగ మొదలైదని అక్కడి నాయకులు.. చర్చించుకుంటున్నారు. తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల విషయం పక్కన పెడితే.. అక్కడ నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వీఐపీలు వస్తూనే ఉంటారు. వీరిలో రాజకీయ.. వివిధ రంగాలకు సంబంధించిన వారు ఉంటారు. మామూలుగా వీరి వసతి .. దర్శనాలకు ఏర్పాట్లు చేయాలంటే.. స్థానిక నాయకులకు చుక్కలు కనిపిస్తుంటాయి. ఇప్పడు ఉప ఎన్నికలు తోడవ్వడంతో బాధలు పీక్స్ కు చేరాయి.
Also Read: కేంద్రంపై దండెత్తుకొస్తున్న రైతులు.. తీవ్ర ఉద్రిక్తత
తిరుపతి ఉప ఎన్నిక పేరు చెప్పి.. అమరావతి, ఢిల్లీ.. హైదరాబాద్ నుంచి ఆయా పార్టీల చిన్నా.. పెద్ద నాయకులు తిరుపతిలో వాలి పోతున్నారు. వచ్చినవారు తిరుపతికే పరిమితం అయితే పరువాలేదు. అక్కడ వసతి చూపించి.. మిగితా పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండొచ్చు. కానీ.. వచ్చిన వారు ఊరికే ఉంటారా..? పనిలో పనిగా.. తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారు. అదీ బ్రేక్ దర్శనాలు అడుగుతున్నారు. దీంతో స్థానిక నాయకులు మరింత ఇరకాటంలో పడిపోతున్నారు.
ఇలాంటి ఇబ్బందులు.. తాడికి లోకల్ లో ఉన్న బీజేపీ నాయకులకు ఎక్కువగా ఉందంట. బీజేపీ జాతీయ పార్టీ.. దానికి ఢిల్లీ నుంచి అమరావతి..హైదరాబాద్ నుంచి అదే పనిగా నాయకులు వస్తున్నారు. ఒక్కరుగా కాకుండా పదుల సంఖ్యలో తిరుపతిలో వాలిపోతున్నారు. వీరికి మర్యాదలు చూడడం ఒక ఎత్తయితే.. స్వామివారి దర్శనం.. ఇప్పడు మహా సమస్యగా మారింది. ఇప్పుడిప్పడే.. టీడీపీ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ లోకల్ నాయకులపై ఒత్తిడి అధికమవుతోంది. ధర్మ పరిక్షణ పోరాటం పేరిట తెలుగు తమ్ముళ్లకు స్థానికంగా చుక్కలు కనిపిస్తున్నాయటంటా.. దీంతో వసతితో పాటు దర్శనాల కోసం పరుగులు పెరుగుతన్నారని సమాచారం.
Also Read: తప్పులో కాలేసిన ‘నిమ్మగడ్డ’
జనసేన నాయకుల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉంది.వైసీపీ నుంచి ఇప్పుడిప్పుడే హడావుడి మొదలైంది. అధికార పార్టీ కాబట్టి పెద్దగా సమస్యలు ఉండవు. కాకపోతే.. రాబోయే ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు తిరుపతిలో ముందుగానే గెస్గ్ హౌస్ లను బుక్ చేసుకుని పెట్టకున్నారట.. బీజేపీ నాయకులైతే ఏకంగా ఇండ్లనే అద్దెకు తీసుకున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందోనని స్థానిక నాయకులు భయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్