తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బైపోల్ సమరం జరగబోతోంది. ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉప సమరం జరగబోతోంది. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి.. ఏపీలో తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ మార్చి ఏడో తేదీన విడుదల కానున్నట్లు ఢిల్లీలోని అత్యున్నత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఖాళీ అయిన ఆరు నెలల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రకారం చూసినా మార్చి మొదటి వారంలో ప్రక్రియ ప్రారంభిస్తే సమయానికి పూర్తవుతుంది.
Also Read: మున్సిపల్ పోరు.. రాజకీయాల్లో మార్పులు..
మార్చి ఏడో తేదీనే ఎందుకంటే ఆ రోజున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అసోం, కేరళల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు పర్యటనలు చేయడం ఆయన స్టైల్. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఆయన ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలో.. అవి అన్నీ పూర్తయ్యాక ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఐదేళ్ల క్రితం మార్చి నాలుగో తేదీన విడుదల చేశారు.
అందుకే.. ఈ సారి ఏడో తేదీన విడుదల చేయవచ్చని ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు. ఆయన మాటను జవదాటే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఒక రోజు అటు ఇటుగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వాటితోపాటు తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల షెడ్యూల్ కూడా ఖాయంగానే విడుదల చేస్తారు. మరోసారి దేశంతోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టించనున్న షర్మిల?
ఇప్పటికే ఈ రెండు స్థానాలపై అటు అధికార పార్టీలు, ఇటు ప్రతిపక్షాలు కన్నేశాయి. అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలని అధికార పార్టీలు ఆరాటపడుతుంటే.. అధికార పార్టీ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని ప్రతిపక్షాలను ఆసక్తితో ఉన్నాయి. అందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే తిరుపతి వేదికగా అన్ని పార్టీలూ అక్కడే మకాం వేశాయి. మరోవైపు.. నాగార్జున సాగర్‌లోనూ వాతావరణం హీటెక్కింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్