భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు..!

లఢక్‌ దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. చైనాతో విభేదాలు ఇంకా సమసిపోనేలేదు. వాస్తవాధీన రేఖ వెంట తరచూ ఉద్రిక్త పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. సరిహద్దు వివాదాలను పరిష్కారానికి ఇరు దేశాల మధ్య కమాండర్‌‌ స్థాయి సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క లఢక్ మాత్రమే కాకుండా.. సిక్కిం సమీపంలోని డోక్లాం ట్రై జంక్షన్ వివాదం.. మరోవంక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించడం వంటి పరిణామాలతో భారత్-చైనా మధ్య ఉద్రిక్తత […]

Written By: Srinivas, Updated On : February 23, 2021 12:52 pm
Follow us on


లఢక్‌ దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. చైనాతో విభేదాలు ఇంకా సమసిపోనేలేదు. వాస్తవాధీన రేఖ వెంట తరచూ ఉద్రిక్త పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. సరిహద్దు వివాదాలను పరిష్కారానికి ఇరు దేశాల మధ్య కమాండర్‌‌ స్థాయి సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క లఢక్ మాత్రమే కాకుండా.. సిక్కిం సమీపంలోని డోక్లాం ట్రై జంక్షన్ వివాదం.. మరోవంక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించడం వంటి పరిణామాలతో భారత్-చైనా మధ్య ఉద్రిక్తత యథాతథంగా నడుస్తోంది.

Also Read: మరిన్ని బ్యాంకులు ప్రైవేటుపరం : ప్రైవేటుబాటలోనే మోడీ

కానీ.. ఈ పరిణామాల మధ్య చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ప్రతిష్ఠాత్మకమైన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాలకు ఈసారి భారత్ వేదిక కాబోతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి. మరో ఐదారు నెలల్లో బ్రిక్స్ సమ్మిట్.. భారత్‌లో ఏర్పాటు కాబోతోంది. ఇందులో పాల్గొనడానికి జిన్‌పింగ్ భారత్‌కు వస్తారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిక్స్ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించితే తప్ప.. జిన్‌పింగ్ భారత పర్యటన దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు.

కరోనాకు చైనా పుట్టినిల్లుగా మారిందంటూ ప్రపంచ దేశాలు ఆరోపించడం, భారత్‌తో తలెత్తిన సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుండడం చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాపై కొన్ని రకాల ఆంక్షలను విధించింది. చైనాతో భారత్ ఏకంగా వాణిజ్యపరమైన యుద్ధానికి తెర తీసింది. ఆ దేశానికి చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేసింది. వందకు పైగా యాప్‌లపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ సారి బ్రిక్స్ సమావేశాలను భారత్‌లో నిర్వహించడానికి చైనా తన మద్దతు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు.. : బెంబేలెత్తుతున్న వాహనదారులు

బ్రిక్స్ దేశాల మధ్య గల సత్సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇది భారత్ నుంచే ఆరంభం అవుతుందని తాము ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. బ్రిక్స్ సమావేశాలను భారత్‌లో నిర్వహించడానికి చైనా మద్దతు ఇస్తోందని చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరంగా బ్రిక్స్ దేశాల ఇచ్చిపుచ్చుకోవాల్సిన వాతావరణాన్ని తమ మధ్య నెలకొల్పాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కోవిడ్‌ను నిర్మూలించడంలో ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా ఉద్యమించాయని, ఇక ఆర్థిక స్థితిగతులను పునరుద్ధరించుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని వెన్‌బిన్ అన్నారు. బ్రిక్స్‌ శిఖరాగ్ర భేటీ ఎప్పుడు నిర్వహించేదా ఖరారు కానప్పటికీ భారత్‌లో మాత్రం ఏర్పాటు చేయాలనేది స్పష్టమైంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్