https://oktelugu.com/

మ‌రో త‌మిళ్ రీమేక్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో చిరు?

సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి య‌మ స్పీడు మీదున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏకంగా నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అందులో మొద‌టిది ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. వేస‌విలో రిలీజ్ చేయ‌బోతున్నారు కూడా. మే 13న రిలీజ్ డేట్ లాక్ చేశారు. Also Read: 2021లో రికార్డ్: ఉప్పెన కలెక్షన్స్ 21 కోట్ల టార్గెట్ కు 10 రోజుల్లో వచ్చింది ఇదీ ఈ మూవీ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 23, 2021 / 12:25 PM IST
    Follow us on


    సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి య‌మ స్పీడు మీదున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏకంగా నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అందులో మొద‌టిది ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. వేస‌విలో రిలీజ్ చేయ‌బోతున్నారు కూడా. మే 13న రిలీజ్ డేట్ లాక్ చేశారు.

    Also Read: 2021లో రికార్డ్: ఉప్పెన కలెక్షన్స్ 21 కోట్ల టార్గెట్ కు 10 రోజుల్లో వచ్చింది ఇదీ

    ఈ మూవీ త‌ర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫ‌ర్’ రీమేక్ పట్టాలెక్కనుంది. ఇప్ప‌టికే కొబ్బ‌రి కాయ కొట్టిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూట్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అది కూడా ఫినిష్ కాగానే.. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్షన్లో తెరకెక్కున్న వేదాళం రీమేక్ సిద్ధంగా ఉంది.

    ఇక ఈ చిత్రం కూడా పూర్తయితే.. కె.ఎస్.ర‌వీంద్ర (బాబీ) లైన్లో ఉన్నాడు. ఆయన వినిపించిన స్క్రిప్టుకు చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లే కనిపిస్తోంది. ఈ మ‌ధ్యే తాను ప‌ని చేయ‌బోయే ద‌ర్శ‌కుల్లో బాబీ కూడా ఉన్న సంగ‌తి మ‌రోసారి ధ్రువీక‌రించాడు చిరు. ఉప్పెన రిలీజ్ వేడుక‌లో మాట్లాడుతూ.. బాబీతో సినిమా ఉంటుంద‌ని చెప్పారు చిరు. మైత్రి మూవీస్ అధినేత‌లే ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని కూడా ప్ర‌క‌టించారు.

    ఆ త‌ర్వాత ‘క్రాక్‌’తో బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ ను చిరు త‌న ద‌గ్గ‌రికి పిలిపించుకుని మ‌రీ అభినందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గోపీతో సినిమా చేయ‌డానికి కూడా చిరు అంగీకారం తెలిపాడ‌ని ప్రచారం జరుగుతోంది. ఇదేదో మాట వ‌ర‌స‌కు అన్నది కాద‌ని, నిజంగానే హామీ ఇచ్చాడ‌ని అంటున్నారు. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెబుతున్నాడట గోపీచంద్.

    Also Read: ఉప్పెన టీం సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

    ఇప్పుడు.. మరో ప్రాజెక్టు కూడా లైన్లోకి వచ్చింది. మరో తమిళ్ సినిమాను రీమేక్ చేసేందుకు చిరు సిద్ధమయ్యారని టాక్. అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై ఎరిందాల్’ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. అయితే.. ఇందులో ప్రధానమైన విషయం ఏమంటే.. ఈ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది. ‘ఎంతవాడు కానీ’ పేరుతో తెలుగులో డబ్ చేశారు మేకర్స్. ఇదే సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి, రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరు.

    అయితే.. ప్రస్తుతం లైన్లో ఉన్న ఆచార్య మేలో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత రానున్న లూసీఫర్, వేదాళం సినిమాలు పూర్తయ్యే నాటికి వచ్చేఏడాది ద్వితీయార్థం అవుతుంది. మరి, ఆ తర్వాత ఏ సినిమా పట్టాలెక్కుతుంది? అన్న‌ది చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్