https://oktelugu.com/

ఏనుగును చంపిన ఘటనలో ముగ్గురు అరెస్ట్!

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది మన దేశ సంస్కృతి కాదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పైనాపిల్ సహా పండ్లలో బాంబులు పెట్టి అవి తింటుండడగా పేలి రెండు ఏనుగులు చనిపోయాయి. ఏనుగులను వేటగాళ్లు ఇలా చంపడం దేశవ్యాప్తంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 5, 2020 / 10:50 AM IST
    Follow us on

    కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది మన దేశ సంస్కృతి కాదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

    పైనాపిల్ సహా పండ్లలో బాంబులు పెట్టి అవి తింటుండడగా పేలి రెండు ఏనుగులు చనిపోయాయి. ఏనుగులను వేటగాళ్లు ఇలా చంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పైనాపిల్ తినడం వల్ల చనిపోయి ఉండక పోవచ్చని.. అడవి పందుల కోసం బెల్లం పూత పూసిన బాంబును తిని మరణించవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.