సచివాలయంలో కరోనా వ్యాప్తిపై సీఎం అసహనం..!

సచివాలయంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో కొత్త కేసులు నమోదు అవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మరోవైపు సచివాలయంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ ముఖ్య కార్యదర్శి అటెండర్ కి కరోనా నిర్దారణ కావడం ఐఏఎస్ అధికారుల్లో […]

Written By: Neelambaram, Updated On : June 5, 2020 9:58 am
Follow us on


సచివాలయంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో కొత్త కేసులు నమోదు అవకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

మరోవైపు సచివాలయంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ ముఖ్య కార్యదర్శి అటెండర్ కి కరోనా నిర్దారణ కావడం ఐఏఎస్ అధికారుల్లో కలకలం మొదలయ్యింది.

ఇప్పటికే వ్యవసాయ, సాధారణ పరిపాలన శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఇద్దరికి కరోనా సోకింది. వీరిద్దరూ రూమ్ మేట్స్. అదేవిధంగా సచివాలయ ప్రాగణంలో ఉన్న అసెంబ్లీ భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో 300 మంది భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం వినతితో ఇప్పటికే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 710 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. సచివాలయంలో కరోనా వ్యాప్తితో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.