https://oktelugu.com/

‘మే’లో కొత్త రికార్డు సృష్టించిన మద్యం అమ్మకాలు

దేశంలోకి కోవిడ్-19 ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా కేంద్రం, రాష్ట్రాలు పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోయాయి. దీంతో లాక్డౌన్ 3.0లోనే కేంద్రం మద్యం అమ్మకాలను కొన్ని షరతులతో ఆయా రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకే మొగ్గుచూపాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు షూరు అయ్యాయి. దీంతో మద్యంప్రియులు షాపులు ఎదుట బారులు తీరి రికార్డు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 5, 2020 / 11:32 AM IST
    Follow us on


    దేశంలోకి కోవిడ్-19 ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా కేంద్రం, రాష్ట్రాలు పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోయాయి. దీంతో లాక్డౌన్ 3.0లోనే కేంద్రం మద్యం అమ్మకాలను కొన్ని షరతులతో ఆయా రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకే మొగ్గుచూపాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు షూరు అయ్యాయి. దీంతో మద్యంప్రియులు షాపులు ఎదుట బారులు తీరి రికార్డు స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేశారు.

    తగ్గిన బీర్ల వాటా.. పెరిగిన లిక్కర్ సేల్స్..
    తెలంగాణలో మాత్రం మే 6నుంచి మద్యం సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఒక్క నెలలోనే రూ.1864.95కోట్ల మద్యం అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. వేసవిలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా అమ్ముడు కావాల్సి ఉండగా దీనికి భిన్నంగా బీర్ల వాటా తగ్గడంపై ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేలో లక్షన్నర కేసుల బీర్లు అమ్ముడు కావాల్సి ఉండగా కేవలం 90వేల కేసులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. బీర్ల వాటా తగ్గడానికి కరోనా మహహ్మరే కారణమని తెలుస్తోంది. మేలో బీర్ల ద్వారా 800కోట్ల ఆదాయంరాగా లిక్కర్ ద్వారా వెయ్యికిపైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. మేలో ప్రతి పదిరోజులకు మద్యం అమ్మకాలు పెరిగుతూ పోవడం గమనార్హం.

    తాజాగా లాక్డౌన్ 5.0లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులను ఇచ్చింది. ఇప్పటివరకు మద్యం సేల్స్ సాయంత్రం 6గంటల వరకు ఉండేది. తాజాగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం రాత్రి 8 గంటల వరకు అనుమతి ఇచ్చింది. దీంతో జూన్ నెలలో మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. తెలంగాణలో మద్యం రేట్లు పెంచినా, కరోనా విజృంభిస్తున్నా మద్యం సేల్స్ తగ్గకపోవడం విశేషం.