Homeజాతీయ వార్తలుThree Maoists killed: మ‌ళ్లీ ఎన్ కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

Three Maoists killed: మ‌ళ్లీ ఎన్ కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

Three Maoists killed: కేంద్ర ప్ర‌భుత్వం మ‌వోయిస్టుల నిర్మూళ‌నే ధ్యేయంగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మ‌వోయిస్టులను జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోవాల‌ని కోరుతోంది. విన‌నిప‌క్షంలో ఎదురుకాల్పుల స‌మ‌యంలో వారిని ఎన్ కౌంట‌ర్ చేస్తోంది. తాజాగా సోమ‌వారం చత్తీస్‌ఘ‌డ్ జిల్లా త‌ర్ల‌గూడ‌, తెలంగాణ ములుగు జిల్లాలోని ఆట‌వి ప్రాంతం స‌రిహ‌ద్దుల్లో ఓ ఎన్ కౌంట‌ర్ జరిగింది. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Three Maoists killed
ఎందుకిలా జ‌రుగుతోంది..? మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారు.. ?
ఈ ప్ర‌జాస్వామ్యంపై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని, దేశ సంప‌ద మొత్తం ప్ర‌జ‌లంద‌రికీ స‌మానంగా ద‌క్కాలని, ఈ ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేదని మావోయిస్టులు చెబుతుంటారు. ప్ర‌జ‌ల‌ను దోచుకునేవారి ప‌ట్ల తాము క‌ఠినంగా ఉంటామ‌ని హెచ్చ‌రిస్తుంటారు. అడ‌విని విడిచా తాము రాబోమ‌ని చెబుతుంటారు. కానీ ప్ర‌భుత్వం వారిని జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి రావాల‌ని ఆహ్వానిస్తోంది. మావోయిస్టులు సాధార‌ణ జీవతాన్ని గ‌డిపేందుకు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించి, జీవ‌నోపాధిని కూడా చూపిస్తామ‌ని చెబుతోంది. కొంద‌రు మావోయిస్టులు ప్ర‌భుత్వ ఆహ్వానాన్ని స్వీక‌రించి జ‌నజీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోతుంటే.. మ‌రి కొంద‌రు అడ‌విలోనే పోరాటం చేస్తున్నారు.
Three Maoists killed
మావోయిస్టుల ఏరివేత ఎందుకు ?

మావోయిస్టుల ఏరివేత ఈరోజు ప్రారంభం అయ్యింది కాదు. పీవీ న‌రంసింహ రావు ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు అమ‌ల‌వుతున్న స‌మ‌యంలోనే ఇవి మొద‌ల‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందకంటే పెట్టుబ‌డులు పెట్టేవారు శాంతిని కోరుకుంటారు. మ‌వోయిస్టులు ఉంటే పెట్టుబ‌డి దారులు ముందుకు రాకపోవ‌డంతో ఈ చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేశారు. యూపీఏ గ‌వ‌ర్న‌మెంట్ ఉన్న‌ప్పుడు ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించారు. ఉమ్మ‌డి ఏపీలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఇది మొద‌ల‌య్యింది. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌జాస్వామ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ల‌డం, గిరిజన పల్లెల‌కు రోడ్డు సౌక‌ర్యం క‌ల్పించ‌డం వంటివి చేశారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరిగేందుకు కృషి చేశారు.

ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో వేగ‌వంతం..
కేంద్రంలో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మావోయిస్టుల నిర్మూళ‌న కోసం వేగంగా అడుగులు వేస్తోంది. అధికారికంగా దీనికి ఆప‌రేష‌న్ సంధాన్ అని పేరు పెట్టింది. 2022 వ‌ర‌కు మ‌వోయిస్టులు లేని దేశంగా భార‌త్ ఉండాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ మ‌ధ్య ప్ర‌భుత్వ చ‌ర్యలు ఉంటున్నాయి. ప్ర‌తీరోజు ఉద‌యం 4 గంట‌ల ప్రాంతంలో కేంద్ర గ్రే హౌండ్స్ బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హిస్తుంటాయి. ఈ స‌మ‌యంలో మావోయిస్టులు నిద్ర‌పోతూనో లేక ఒక ప్రాంతం వ‌దిలి మ‌రొక ప్రాంతానికి వెళ్తూనే ఉంటారు. అలాంటి క్ర‌మంలో ఒక‌రికొక‌రు ఎదురుప‌డిన‌ప్పుడు కాల్పులు జ‌రిగే అవ‌కాశం ఉంది. ముందుగా ప్ర‌భుత్వం త‌రుపున బ‌ల‌గాలు లొంగిపోయి, జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాల‌ని కోరుతాయి. ఈ స‌మ‌యంలో అటునుంచి ఎదురుకాల్పులు జ‌రిగితే వీళ్లు కాల్పులు జ‌రుపుతారు. ఇందులో కొన్ని ఫేక్ ఎన్‌కౌంట‌ర్‌లు కూడా ఉండే అవ‌కాశం ఉంటుంది. ఆ స‌మ‌యంలో మృతుల కుటుంభ స‌భ్యులు, పౌర సంఘాల నాయ‌కులు ఆందోళ‌నలు నిర్వ‌హిస్తారు. కొన్నాళ్ల‌కు అది చ‌ల్ల‌బ‌డుతుంది.

మావోయిస్టుల విష‌యంలో ప్ర‌జ‌లేమి కోరుకుంటున్నారు. ?

మావోయిస్టులు అడ‌విలో ఉండ‌టం క‌న్నా.. బ‌య‌ట జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసి ఈ స‌మాజంలో ఉండ‌టం వల్లే ఎక్కువ ఉప‌యోగాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. ఎక్క‌డో అడ‌విలో ఉండి గ‌న్ ప‌ట్టుకొని పోరాడ‌టం క‌న్నా.. గ‌న్ వ‌దిలేసి రాజ‌కీయంగా ప్ర‌జ‌ల ప‌క్షాల పోరాడాల‌ని కోరుకుంటున్నారు. అడ‌విలో ఉండి పోరాడ‌టం ప్ర‌జ‌ల్లో ఉండి క్షేత్ర స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై గ‌ల‌మెత్తాల‌ని భావిస్తున్నారు. ఈ మ‌ర‌ణ‌కాండ‌ను ప్ర‌జ‌లు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. ప్ర‌భుత్వం కూడా మ‌వోయిస్టుల‌ను స‌మాజంలోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని కోరుకుంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular