బ్యాంకులకు కన్నాలేసి  ఆ ఎంపీలు కాపాడుకుంటున్నారా?

వాళ్లిద్దరూ ఏపీ ఎంపీలు.. ఒకరేమో అధికార పార్టీలో చేరి.. ఆ పార్టీలో అసమ్మతి రాజేసి బీజేపీకి మద్దతు తెలిపారు. ఇంకొకరేమే ప్రతిపక్ష టీడీపీలో ఎంపీగా నామినేట్ అయ్యి బీజేపీ పంచన చేరారు. ఇద్దరూ ఇప్పుడు వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తమ సొంత ఆస్తులు, కేసుల నుంచి బయటపడడానికి బీజేపీని మచ్చిక చేసుకుంటున్నారట.. తాజాగా వారిద్దరిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. వారిద్దరూ చేసిన తప్పులే వారు ఆగం కావడానికి కారణమని ట్రోలింగ్ […]

Written By: NARESH, Updated On : September 29, 2020 5:18 pm

caro

Follow us on

వాళ్లిద్దరూ ఏపీ ఎంపీలు.. ఒకరేమో అధికార పార్టీలో చేరి.. ఆ పార్టీలో అసమ్మతి రాజేసి బీజేపీకి మద్దతు తెలిపారు. ఇంకొకరేమే ప్రతిపక్ష టీడీపీలో ఎంపీగా నామినేట్ అయ్యి బీజేపీ పంచన చేరారు. ఇద్దరూ ఇప్పుడు వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తమ సొంత ఆస్తులు, కేసుల నుంచి బయటపడడానికి బీజేపీని మచ్చిక చేసుకుంటున్నారట.. తాజాగా వారిద్దరిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. వారిద్దరూ చేసిన తప్పులే వారు ఆగం కావడానికి కారణమని ట్రోలింగ్ నడుస్తోంది.

Also Read: టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు అతడేనా?

ఏపీ ఎంపీలు ఇద్దరూ ఆశ్చర్యకరంగా  బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వారేనని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. 2010లో ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థ  ఓ ఏంపీకి  ఉండేదట.. దీని మీద ఇప్పటికే ఆయన 947 కోట్ల రూపాయలను బ్యాంకులో లోన్ తీసుకున్నాడని.. కానీ తీర్చలేకపోయాడని ఓ టాక్ ఏపీ రాజకీయాల్లో ప్రచారంలో ఉంది. దాని మీద  న్యూఢిల్లీలోని ఎకనామిక్ ఆఫీస్ వింగ్ లో కేసు నమోదైందట.. ఈ కేసు విచారణ రావడంతో ఇక గెలిచిన పార్టీలో ఉంటే ఇక లాభం లేదని.. బీజేపీలో చేరి ఆ కేసులు విచారణకు రాకుండా మాఫీ చేసుకోవాలని.. బ్యాంకులకు కట్టాల్సిన వందల కోట్లు కూడా తప్పించుకోవచ్చనే కారణంతోనే సదురు ఎంపీ బీజేపీకి దగ్గరైనట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక మరో ఎంపీకి బ్యాంకు కష్టాలు భారీగా ఉన్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది.. బరోడా బ్యాంకుకు సదురు ఎంపీ దాదాపు 322 కోట్లు బకాయిలు పడ్డాడట. వడ్డీతో కలిపి మొత్తం 400 కోట్లు అయ్యిందట.. బాకీలు చెల్లించకపోవడంతో  ఈయన ఆస్తులకు వేలం ప్రకటన వేసి బ్యాంకు నోటీసులు జారీ చేసింది. పత్రికల్లోనూ నోటిఫికేషన్ ఇచ్చింది.

Also Read: బీజేపీ నేతల మౌనం వెనుక అసలు కథేంటి?

బ్యాంకులకు వందల కోట్లను ఇద్దరు ఎంపీలు ఎగ్గోట్టారని.. అందుకే వీరుద్దరూ బీజేపీలో చేరి నాటకాలు ఆడుతున్నారని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ట్రోల్స్ ను విపరీతంగా షేర్ చేస్తూ ఎండగడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన ఇద్దరు ఎంపీల బాగోతాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే ట్రోలింగ్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ సర్కార్ ను విమర్శిస్తున్న వారి యవ్వారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.