https://oktelugu.com/

వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..!  

అల్లు అర్జున్ టాలీవుడ్లో మెగా హీరోగా కొనసాగుతున్నా.. మాలీవుడ్ లో మాత్రం మల్లుస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తాయో మలయాళీలను అలాగే ఆకట్టుకుంటున్నాయి. దీంతో అల్లు అర్జున్ నటించే ప్రతీ సినిమా తెలుగుతోపాటు మాలయాళంలో నేరుగా రిలీజ్ అవుతుంటాయి. నిజానికి అల్లు అర్జున్ సినిమాలు తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువగా కలెక్షన్లు రాబడుతుంటాయి. Also Read: అర్దరాత్రి గోదావరి దగ్గర బోల్డ్ బ్యూటీ ! అల్లు అర్జున్ తాజాగా తన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2020 / 04:06 PM IST

    allu arjun wife

    Follow us on

    అల్లు అర్జున్ టాలీవుడ్లో మెగా హీరోగా కొనసాగుతున్నా.. మాలీవుడ్ లో మాత్రం మల్లుస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏవిధంగా అలరిస్తాయో మలయాళీలను అలాగే ఆకట్టుకుంటున్నాయి. దీంతో అల్లు అర్జున్ నటించే ప్రతీ సినిమా తెలుగుతోపాటు మాలయాళంలో నేరుగా రిలీజ్ అవుతుంటాయి. నిజానికి అల్లు అర్జున్ సినిమాలు తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువగా కలెక్షన్లు రాబడుతుంటాయి.

    Also Read: అర్దరాత్రి గోదావరి దగ్గర బోల్డ్ బ్యూటీ !

    అల్లు అర్జున్ తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో స్నేహతో బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న పిక్ షేర్ చేశాడు. అంతేకాకుండా స్నేహను ‘క్యూటీ హ్యాపీ బర్త్ డే’ అంటూ సంబోధించి తన ప్రేమను చాటుకున్నాడు. స్నేహ అంటే అందరూ అనుకున్నట్లు హీరోయిన్ స్నేహ కాదు.. అల్లు అర్జున్ భార్య స్నేహ. నేడు ఆమె బర్త్ డే ను పురస్కరించుకొని అల్లు అర్జున్ అభిమానులకు ఓ ఫొటో చేసి తన ఆనందాన్ని వెలిబుచ్చాడు.

    టాలీవుడ్లో పెళ్లయిన మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అర్జున్-స్నేహ జోడి కూడా ఒకటి. వీరిద్దరిది ప్రేమ వివాహం. 2011లో స్నేహను అల్లు అర్జున్ వివాహం చేసుకున్నాడు. నేడు స్నేహ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ పాల్గొని ఆమెకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపాడు. స్నేహ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

    Also Read: చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ !

    ‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.. ఇలాగే ఎన్నో బర్త్‌డేలను మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ తన ఇన్ స్ట్రాగ్రాంలో కామెంట్ చేశాడు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరి అనోన్య దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.