https://oktelugu.com/

అర్దరాత్రి గోదావరి దగ్గర బోల్డ్ బ్యూటీ !

హీరోయిన్ గా ఎంత ప్రయత్నించినా నందినీ రాయ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఆ మధ్య బోల్డ్ ఫోటో షోలతో కుర్రాళ్ళ మీద తన హాట్ లుక్స్ తో బోల్డ్ యుద్ధానికి తెర లేపింది. మొత్తానికి ఈ బ్యూటీ పడ్డ కష్టం గమనించిన బిగ్ బాస్ షో నిర్వాహకులు అమ్మడి బాధను అర్ధం చేసుకుని.. గత సీజన్ బిగ్‌ బాస్ షోలో తీసుకున్నారు. దాంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. వచ్చిన […]

Written By:
  • admin
  • , Updated On : September 29, 2020 / 04:01 PM IST
    Follow us on


    హీరోయిన్ గా ఎంత ప్రయత్నించినా నందినీ రాయ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఆ మధ్య బోల్డ్ ఫోటో షోలతో కుర్రాళ్ళ మీద తన హాట్ లుక్స్ తో బోల్డ్ యుద్ధానికి తెర లేపింది. మొత్తానికి ఈ బ్యూటీ పడ్డ కష్టం గమనించిన బిగ్ బాస్ షో నిర్వాహకులు అమ్మడి బాధను అర్ధం చేసుకుని.. గత సీజన్ బిగ్‌ బాస్ షోలో తీసుకున్నారు. దాంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి నందినీ రాయ్ కూడా బాగానే కష్ట పడింది గానీ.. పెద్దగా సినిమా అవకాశాలను అయితే సంపాధించలేకపోయింది. అయితే ఏం తనకు వచ్చిన క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేయడానికి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఆ రకంగా ముందుకు పోతొంది.

    Also Read: పేరు మార్చుకున్న యాంకర్ రష్మీ.. ఏం పేరు పెట్టుకుందో తెలిస్తే షాకే..

    ఎప్పటికప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే తన హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా నందినీ రాయ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మళ్లీ నెటిజన్లకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. తాజాగా ఈ సుందరి రాజమండ్రికి వెళ్ళింది. అక్కడి గోదావరి అందాలను చూసి తెగ పులకరించపోయింది. ముఖ్యంగా గోదావరి గట్టును చూసి ఫుల్ ఎంజాయ్ చేసిందట. అర్దరాత్రి తన స్నేహితురాళ్లతో కలిసి అడవి గుండా ప్రయాణం చేసిందట. ఈ క్రమంలోనే గోదావరి కూడా వెళ్ళిందట. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో.. అసలు ఉన్నట్లు ఉండి గోదావరి మీద ఎందుకు వెళ్లిందో నందినీ రాయ్ కే తెలియాలి.

    Also Read: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సెట్ లో కరోనా !

    ఏ సినిమా షూటింగ్ కోసమో వెళ్లి ఉంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెట్టగా.. మరికొందరు మాత్రం.. ఈ అమ్మడుకు ఇలా ప్రయాణం చేయడం అనేది ఓ అడ్వెంచర్‌ అని అందుకే అప్పుడప్పుడు ఈ భామ ఇలాంటి ట్రిప్స్ వేస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైనా ఉంటుందని.. దాని కోసం రాద్దాంతం చేయడం అనవసరం అని, అసలు ఏదైనా మన మీదే ఆధారపడి ఉంటుందని, మనం ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుందని సంచలన కామెంట్స్ చేసింది. ఇక పనిలో పనిగా తనెప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని రొటీన్ డైలాగ్ కూడా చెప్పి.. తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో విలువ లేదని, అదే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలకు ఇక్కడ అన్ని ఇస్తారని కామెంట్స్ కూడా చేసిన సంగంతి తెలిసిందే.