ఆ ఎమ్మెల్యేలను జగన్ నిండా ముంచేశాడు..! ఇంకేం మిగిలిందని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇప్పటికే 250 రోజులు దాటిపోయింది. రాజధానిగా అమరావతి నుండి హోదాని లాక్కొని విశాఖకు కట్టపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక టెక్నికల్ గా చూసుకుంటే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుంది. అయితే ఈ విషయమై ఎన్నో చట్టపరమైన ఇబ్బందులు వచ్చి ఇప్పుడు కోర్టులో మూడు రాజధానులు విషయం నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణ, గుంటూరు జిల్లా ప్రజలు […]

Written By: Navya, Updated On : August 21, 2020 3:52 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇప్పటికే 250 రోజులు దాటిపోయింది. రాజధానిగా అమరావతి నుండి హోదాని లాక్కొని విశాఖకు కట్టపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక టెక్నికల్ గా చూసుకుంటే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగుతుంది. అయితే ఈ విషయమై ఎన్నో చట్టపరమైన ఇబ్బందులు వచ్చి ఇప్పుడు కోర్టులో మూడు రాజధానులు విషయం నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణ, గుంటూరు జిల్లా ప్రజలు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై పగ పెంచుకున్నాడు.

Also Read : బాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు.!

రాజధాని రైతులు కాకుండా ఈ రెండు ప్రాంతాల్లోని మిగిలిన ప్రజలు కూడా వారి భూములకు, ఇళ్లకు, స్థలాలకు, పొలాలు ఇకపై డబల్ రేటు పలుకుతాయన్న ఆతృతతో ఆస్తులు కొనుక్కున్న వారు, మంచి రేటు వచ్చినా అమ్మని వారంతా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పేరు వింటేనే ఒంటి కాలుపై లేస్తున్నారు. ఇక ఈ సమయంలో ఈ ప్రభావం కాస్తా లోకల్ ఎమ్మెల్యేలపై పడింది. ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలలో తిరగలేని పరిస్థితి. ఎవరైనా వచ్చి ఇదేమిటని నిలదీసేందుకు కూడా కనపడకుండా ముఖం చాటేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక సామాజిక వర్గం వారు అయితే ఇప్పటికే ఉన్న వ్యతిరేకతకు తమ ఆజన్మ పగను జోడించి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలను దించేయాలని కంకణం కట్టుకున్నారు.

అసలే కృష్ణా, గుంటూరు జిల్లాలో వారిదే హవా. ఏదో జగన్ సునామీ వల్ల ఈ ఎమ్మెల్యేలంతా కిందా మీదా పడి గెలుచుకొని వచ్చారు. ఇక తర్వాత ఎన్నికల్లో ఇంతటి వ్యతిరేకత మధ్య వారు గెలవడం గగనమే. అయితే ఇతర ప్రాంతాల్లో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం పూర్తి భరోసా వచ్చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు అయితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం తమదేనని…. ఇంతకుమించిన బంపర్ తాము ఎమ్మెల్యేలుగామెజారిటీతో గెలిచి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు.

ఇక ఈ రెండు జిల్లాల ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే గెలుపు సంగతి అటుంచితే…. కనీసం ఎన్నికలకు డబ్బులు పెట్టేందుకు కూడా సంశయించే పరిస్థితి. ఇంకా ఎన్నికలకు మూడున్నర సంవత్సరాలు పైనే సమయం ఉంది కానీ అప్పటికి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందేమో అని వారి భయం. దీంతో అంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సరే ప్రజలకు ఏదైనా సహాయం చేసి వారిలో మైలేజీ సాధిద్దాం అనుకుంటే ఈ సచివాలయాలు వచ్చి వారికి ఆ కాస్త స్కోప్ ని కూడా దూరం చేశాయి. మరి వారు ఎమ్మెల్యేలుగా ఉండి ఏం సాధించినట్టు…? తర్వాత ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నా ఏమి నెగ్గగలరు? అన్నట్టు అయిపోయింది పరిస్థితి.

Also Read : అచ్చెన్న, జేసీ అరెస్టులు పథకం ప్రకారమే..? ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయ్