అధిక విద్యుత్ ఉత్పత్తే.. కొంప ముంచిందా?

శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో పరిధిలోకి వచ్చే శ్రీశైలంలోని ఎడమ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్లో గురువారం సామర్థ్యానికి మించి అధికంగా విద్యుత్ ఉత్పత్తి అవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే టాక్ విన్పిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రంలో 150 నుంచి 180 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా నిన్న 200 మెగావాట్లకు మించి విద్యుత్ […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 3:40 pm
Follow us on


శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో పరిధిలోకి వచ్చే శ్రీశైలంలోని ఎడమ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్లో గురువారం సామర్థ్యానికి మించి అధికంగా విద్యుత్ ఉత్పత్తి అవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే టాక్ విన్పిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రంలో 150 నుంచి 180 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా నిన్న 200 మెగావాట్లకు మించి విద్యుత్ ఉత్పత్తి అయినట్లు సమాచారం. అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండగానే ఒక్కసారిగా లోడ్ అధిక కావడంతో మంటలు చేలరేగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?

ఊహించని విధంగా భారీగా మంటలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులు తీశారు. యూనిట్ ను పూర్తిగా షట్ డౌన్ చేశారు. ఇందులో పనిచేస్తున్న 20మంది సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ బృందం మంటలను ఆర్పే ప్రయత్నం చేసి ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 10మందిని ఇప్పటికే కాపాడారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకో తొమ్మిది మంది విద్యుత్ కేంద్రంలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే దట్టమైన పోగ కారణంగా సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద సంఘటనపై మంత్రి జగదీష్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని సీఎం వారిని ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కాపాడేందుకు ఇప్పటికే అధికారులు సింగరేణి సాయం కోరినట్లు తెలుస్తోంది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

ఈ ప్రమాదం వల్ల తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్దఎత్తున ఆటంకం ఏర్పడటంతోపాటు భారీ నష్టం కలుగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అండగా ఉంటాయని భరోసా కల్పిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిందేనని పలువరు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది.