భారతీయ వంటింటి చిట్కాకు ఫిదా అయినా ఆక్సఫర్డ్..!

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటుంది. చిన్నచిన్న వ్యాధులకు మన దేశంలోని ప్రజలు వంటింటి చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. ఆ వంటింటి చిట్కాలే చాలా సందర్భాల్లో సమర్థవంతంగా పని చేస్తుంటాయి. మన ఇంట్లోని దినుసులే మనలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఎలాంటి రోగానికైనా వంటింటి దినుసులు దివ్యౌషధంలా పని చేస్తాయి. Also Read : పొడిగాలిలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్! వంటింటి దినుసుల వల్ల వివిధ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2020 3:56 pm
Follow us on

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటుంది. చిన్నచిన్న వ్యాధులకు మన దేశంలోని ప్రజలు వంటింటి చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. ఆ వంటింటి చిట్కాలే చాలా సందర్భాల్లో సమర్థవంతంగా పని చేస్తుంటాయి. మన ఇంట్లోని దినుసులే మనలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఎలాంటి రోగానికైనా వంటింటి దినుసులు దివ్యౌషధంలా పని చేస్తాయి.

Also Read : పొడిగాలిలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్!

వంటింటి దినుసుల వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చిట్కాల వైద్యమే అయినా రోగాలను తరిమికొట్టడంలో మంచి ఫలితాలను ఇస్తుంది. చాలా రోగాలను నయం చేసుకోవడం కోసం మనం తేనెను వాడతాం. కొందరు పరగడుపునే తేనెను తీసుకుంటూ ఉంటారు. పరగడుపునే తేనెను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.

మన భారతీయ వంటింటి వైద్యంపై కొన్ని నెలల క్రితం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో తేనె అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను సమర్థవంతంగా నయం చేస్తుందని తేలింది. వ్యాధుల నివారణ కోసం వినియోగించే మందుల కంటే తేనెను వినియోగించడం మంచిదని ఆక్స్ ఫర్డ్ పేర్కొంది. భారతీయ వంటింటి చిట్కాలు అద్భుతం అని ప్రశంసించింది. ప్రతీ చిన్న అనారోగ్యానికి మందులు వేసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జలుబు లేదా దగ్గు లాంటివి వచ్చినప్పుడు తేనె వాడితే చాలు అని నిపుణులు సైతం చెబుతుండటం గమనార్హం.

Also Read : ఉదయం తొందరగా లేచేవారిలో దారుణమైన వ్యాధి.. ఏంటంటే?