Bangalore : దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. దానికంటే ముందు డిసెంబర్ 31 వేడుకలు ఇంకా అద్భుతంగా జరిగాయి. పబ్బులు, రిసార్టులు, వైన్ షాపులు జాతరలను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇసుక వేస్తే రాలనంత తీరుగా జనం ఉన్నారు. మద్యం, మాంసం, బేకరీ ఉత్పత్తులు, నూతన వస్త్రాల కొనుగోలు.. ఈ వ్యాపారాలు మొత్తం జోరుగా సాగాయి. వందల కోట్ల మార్క్ చేరుకున్నాయి. ప్రభుత్వం టార్గెట్ విధించడంతో ఎక్సైజ్ శాఖ వైన్ షాపుల నిర్వహణకు సమయాన్ని కాస్త సడలించింది. ప్రతిరోజు లాగా కాకుండా, ఈసారి సమయాన్ని పొడగించింది. దీంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. పెట్టెలకు పెట్టెల మద్యాన్ని లేపి పడేశారు. ఇక పబ్బుల్లో అయితే అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా తాగారు. తాగిన తర్వాత చిందేశారు. పబ్ ముగిసిన తర్వాత బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. తాగింది తలకు మొత్తం ఎక్కడంతో.. అడుగులు వేయడానికే వారు ఇబ్బంది పడ్డారు.. చివరికి ఎలాగోలా బయటికి వచ్చినప్పటికీ.. వారు ఇళ్లకు వెళ్లిపోవడమే చాలా కష్టంగా మారింది.
ఇలా బయటికి తీసుకొచ్చారు
దేశంలోని ఐటి రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తుంటారు. డిసెంబర్ 31st నాడు బెంగళూరులో మద్యం ఏరులై పొంగింది. పబ్బుల్లో అయితే ఐటి ఉద్యోగులు సందడి చేశారు. మద్యం తాగి డ్యాన్స్ లతో అదరగొట్టారు. అయినప్పటికీ వారికి తాగింది దిగలేదు. ఈలోపు పబ్బుల సమయం గడిచిపోవడంతో వారందరినీ బయటికి పంపించారు. ఈ సమయంలోనే బయట ఉన్న పోలీసులు.. ఇతర సెక్యూరిటీ గార్డులు తాగిన వారిని జాగ్రత్తగా వాహనాల్లో దింపారు. కొంతమంది అమ్మాయిలు అయితే నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ స్థాయిలో భారీ మద్యం తాగారు. ముఖ్యంగా ఒక అమ్మాయి అయితే తాగి అలా కింద పడిపోయింది. ఆమె వస్త్రధారణ కూడా అత్యంత దారుణంగా ఉంది. దీంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వారిని తీసుకొచ్చారు. వాహనాలలో ఎక్కించి ఇళ్లకు పంపించారు. కొంతమంది తాగి రోడ్లమీదకి వచ్చి హంగామా సృష్టించడంతో.. పోలీసుల వారికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు చేశారు. భారీగా అపరాధ రుసు విధించారు. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలను భారీగా జరుపుకున్నప్పటికీ.. తాగింది బాగా ఎక్కడంతో.. పోలీసుల సహకారంతో ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. కొంతమంది అయితే పోలీస్ స్టేషన్లోనే గడపాల్సి వచ్చింది. అయితే ఈ పరిణామాల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.. ప్రొఫెషనల్ వ్యక్తులై ఉండి ఇలా తాగి రోడ్లమీద పడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరులో న్యూఇయర్ పార్టీ తర్వాత పరిస్థితి ఇదీ! pic.twitter.com/fAZ9dqZQE9
— ChotaNews App (@ChotaNewsApp) January 1, 2025