https://oktelugu.com/

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగతో చేయబోయే సినిమాలో మొత్తం బట్టలు విప్పి నటించే సీను ఉందా? దానికి బన్నీ ఒప్పుకున్నాడా..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో పెను సంచలనాలను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 08:07 AM IST

    Sandeep Reddy Vanga , Allu Arjun

    Follow us on

    Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే… ఇక ‘పుష్ప 2’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో భారీ గుర్తింపు ను సంపాదించుకున్నాడు. దాదాపు 1800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా తొందర్లోనే దంగల్ సినిమా రికార్డ్ ను కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని క్రియేట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియాలో భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ‘ సందీప్ రెడ్డివంగ’ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు… ఇక ఇప్పటికే సందీప్ చేసిన సినిమాలన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం…మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. మరి వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా చాలా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక ఇప్పటివరకు ప్రతి క్యారెక్టర్ లో వేరియేషన్స్ ని చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి కొత్త క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆయన ఒక సీన్ లో న్యూడ్ గా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇంతకుముందు సందీప్ రెడ్డివంగా రణ్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్ ‘ సినిమాలోని ఒక సీన్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ అలాగే కనిపించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ దీని మీద ఇప్పటివరకు ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. కానీ మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ అనుకున్నట్టుగా హీరోలతో నటింపజేయాలని చూస్తున్నాడు.

    కాబట్టి తను అనుకుంటే మాత్రం కచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఇలాంటి సీన్స్ లలో నటిస్తాడా లేదా అనే విషయం మీద ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. కాబట్టి ఈ సీన్ లో ఆయన నటించకపోవచ్చు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…