https://oktelugu.com/

Indian Railways: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళ్తుందో తెలుసా?

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. సుమారు 15 లక్షల మంది ఉద్యోగాలు, లక్షల కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. నిత్యం లక్షల మందిని భారతీయ రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 20, 2024 9:36 am
    Indian Railways

    Indian Railways

    Follow us on

    Indian Railways: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటి. మన దేశం ఐదో స్థానంలో ఉంది. 28 రాష్ట్రాల్లో రైలు మార్గాలు ఉన్నాయి. అన్ని రైలుమార్గాలు లింక్‌ అయి ఉన్నాయి. భారత దేశంలో అత్యధిక మంది రవాణా సాధనం కూడా రైలే. అయితే చాలా రైల్లు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ప్రయాణిస్తాయి. కొన్ని రైళ్లు మాత్రం కొన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఉన్నా… కొన్ని రైళ్లు మాత్రమే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాయి. అయితే ఒక రైలు మాత్రం దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ప్రజల ఆదరణతో రైల్వే శాఖ కూడా దీనిని కొనసాగిస్తోంది. అయితే ఆ రైలు ఏది.. ఎంత దూరం ప్రయాణిస్తుంది. ఎన్ని రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.

    13 రాష్ట్రల గుండా ప్రయాణం..
    భారత రైల్వేలో 13 రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు ఒకటి ఉంది. దేశంలోని దాదాపు సంగం రాష్ట్రాలను ఇది కలుపుతుంది. ఆయా రాష్ట్రాల ప్రజలను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఆ రైలుపేరే నవయుగ్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది కర్ణాటక నుంచి జమ్మూకశ్మీర్‌కు ప్రయాణిస్తుంది. కర్ణాటకలోని మంగళూరు నుంచి జమ్మూ కశ్మీర్‌లోని జమ్ముతావి వరకు నడుస్తుంది. మార్గం మధ్యలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ మీదుగా జమ్ముతావి చేరుకుంటుంది.

    12 రాష్ట్రాల్లో హాల్టింగ్‌..
    ఇక ఈ నవయుగ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 12 రాష్ట్రాల్లో హాల్గింగ్‌లు ఉన్నాయి. ఒక్క హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రమే నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తుంది. ఈ రైలు మంగళూరు నుంచి జమ్ముతావి చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. 13 రాష్ట్రాలను దాటడానికి 68 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. భారత దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.