Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ స్థాయి ఫైర్ సీజన్ ప్రారంభమైన 6 వారాల తర్వాత మొదలు అవుతుంది. కానీ ఈ సీజన్ లో మాత్రం రెండవ వారం నుండే మొదలైంది. బిగ్ బాస్ అలాంటి పరిస్థితులను కూడా చాలానే కల్పించాడు. ఆహారం విషయం లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఏర్పడేలా చేసాడు. వారం మొత్తం మీద హౌస్ లో ఉన్న రెండు క్లాన్స్ కి సంబంధించిన సభ్యులు కేవలం 14 గంటలు మాత్రమే వంట చేసుకోవాలి అనే రూల్ పెడుతాడు. దీని వల్ల భవిష్యత్తులో కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉంది. కేవలం ఒక చిన్న దోశ విషయం లో కంటెస్టెంట్స్ ఈ వారం ఎంత పెద్ద గొడవ పెట్టుకున్నారో మన కళ్లారా చూసాము. భవిష్యత్తులో దీనికి మించిన గొడవలు ఇంకా జరగొచ్చు. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన గుడ్ల టాస్కు లో నిఖిల్ కి ఒక్క ఎర్ర గుడ్డు కనిపిస్తుంది. దాని గురించి రూమ్ లోకి వెళ్లి తన కంటెస్టెంట్స్ కి చెప్తాడు.
కచ్చితంగా ఆ గుడ్డు వల్ల ఎదో ఒక లాభం జరుగుతుంది, వెంటనే తీసేసుకో అని సోనియా, సీత చెప్తారు. నిఖిల్ వాళ్ల మాట విని రెడ్ ఎగ్ ని జోబులో వేసుకొని వచ్చేస్తాడు. అయితే ఈ రెడ్ ఎగ్ వెనుక ఉన్న ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసాడు బిగ్ బాస్. ఎవరికీ అయితే ఈ రెడ్ ఎగ్ దొరుకుంటుందో, వాళ్ళు చీఫ్ పోటీ నుండి తప్పుకుంటారు. చీఫ్ పోటీలకు నిఖిల్ క్లాన్ నుండి ముగ్గురు, అభయ్ క్లాన్ నుండి ముగ్గురు పాల్గొనాలి. అత్యధిక గుడ్లు కలిగి ఉన్నందుకు నిఖిల్ చీఫ్ పోటీదారుడు అయ్యాడని చెప్తాడు బిగ్ బాస్. కానీ అతనికి రెడ్ ఎగ్ దొరకడం తో బిగ్ బాస్ గేమ్ నుండి నిఖిల్ ని తప్పుకోవాల్సిందిగా ఆదేశిస్తాడు. ఇక కేవలం ఇద్దరు మాత్రమే నిఖిల్ క్లాన్ నుండి పోటీ పడాలి.
ఆ ఇద్దరు ఎవరో నిర్ణయించుకొని చెప్పుమనగా నైనిక, సీత పోటీ చేసేందుకు ముందుకు వస్తారు. అలాగే తక్కువ గుడ్లు ఉన్న కారణంగా ‘కాంతారా’ టీం చీఫ్ అభయ్ ఈ పోటీ లో పాల్గొనేందుకు వీలు లేదని బిగ్ బాస్ చెప్తాడు. దీంతో చీఫ్ పోటీకి మణికంఠ, ప్రేరణ, నబీల్ పోటీ పడుతారు. వీరిలో ఎవరు గెలిచి చీఫ్స్ అవుతారో రేపటి ఎపిసోడ్ లో చూడాలి. అయితే ఇంత కష్టపడి అత్యధిక గుడ్లు గెలుచుకొని ప్రయోజనం ఏమిటి?, మనకంటే వాళ్ళకే ఎక్కువ లాభాలను బిగ్ బాస్ చేకూర్చాడు అని నిఖిల్ టీం అనుకుంటూ బాధపడుతారు. రేపటి ఎపిసోడ్ లో మరికొన్ని ట్విస్టులు కూడా రావొచ్చు. కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ అయ్యే క్షణాలు ఈ వారం లో ఇంకా ఉంటాయని టాక్, అవేంటో చూడాలి మరి.