RK Roja: త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఇటీవల ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సంఘటన అందరికీ తెల్సిందే. ఈ దుర్ఘటనలో ఆయన భార్యతోపాటు 12మంది ఆర్మీ సిబ్బంది మృత్యువాతపడటం అందరినీ కలిచివేసింది. ఈ ఘటన మరువకముందే ఇలాంటి వార్తే తెలుగు ప్రజలను కంగారు పెట్టించింది. అయితే విమాన ప్రమాదం నుంచి ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు త్రుటిలో తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంది. రాజమండ్రి ఎయిర్ పోర్టులోని ఇండిగో విమానంలో ఆర్కే రోజా ప్రయాణం కోసం ఎక్కారు. ఇదే విమానంలో టీడీపీ చెందిన మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు కూడా ప్రయాణిస్తున్నారు. అయితే విమానం తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన సమయంలో అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ గా బెంగుళూరు తరలించాడు. దీంతో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానం బెంగుళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యే రోజా చాలాసేపటి వరకు విమానంలో ఉండిపోయారు. విమానంలో ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.
Also Read: మంత్రి పదవి కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కూడా కాదంట..?
తిరుపతిలో వాతావరణం అనుకూలించకపోవడతోనే పైలట్ విమానాన్ని బెంగుళూరుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్లైట్ నుంచి బయటికి వచ్చిన ప్రయాణికుల నుంచి ఇండిగో సిబ్బంది అదనపు రుసుము డిమాండ్ చేసినట్లు తెల్సింది. దీంతో ఈ వ్యవహారం వివాదానికి కారణమవుతోంది. యాజమాన్యం తప్పిదానికి తాములే బాధ్యులమంటూ మండిపడుతున్నారు.
మొత్తానికి ఫైయిట్ బెంగుళూరు సేఫ్ గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా అక్కడి నుంచి తిరుపతి వచ్చేందుకు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విమాన ప్రమాదం నుంచి ఆర్కే రోజా తృటిలో తప్పించుకుందనే వార్త బయటికి రావడంతో ఆమె అభిమానులు హమ్మయా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రోజాకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు.
Also Read: కాశీలో కాలినడక.. ప్రధాని మోడీ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి