PM Modi in Varanasi: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనకు వారణాసి వెళ్లారు. నిన్న అర్థరాత్రి వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ తరువాత వీధుల్లో పర్యటించారు. కాశీలో పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజల బాధలు అర్థం చేసుకున్నారు ఎక్కడ సమస్యలున్నాయో అనే విషయంపై ఆయన ఆరా తీశారు. కాశీలో జరుగుతున్న పనులు పరిశీలించారు. బీజేపీ పాలిత స్టేట్ల సీఎంలతో భేటీ అయ్యారు.
వారణాసిపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కాశీ వీధుల్లో నడిచి పనులు పరిశీలించారు. కాశీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇష్తున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ రెండు రోజులు ఉండి పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికి గాను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.
Also Read: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?
కాశీ పర్యటన విశేషాలను ప్రధాని తన ట్విటర్ లో పోస్టు చేశారు. కాశీ పర్యటనపై మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు భవిష్యత్ లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని చెబుతున్నారు. కాశీ పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఇంకా పలు పనులు చేస్తామన్నారు. వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అక్కడే బస చేశారు.
మంగళవారం కూడా ఇంకా పలు కార్యక్రమా్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాశీలో ముఖ్యమైన పనుల్లో వేగం పెంచాలని చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో అధిక సీట్లు సొంతం చేసుకునే పనిలో భాగంగానే ప్రధాని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీని కోసమే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కాశీ నుంచి.. చీరకట్టుకొని పారిపోయిన బ్రిటీష్ గవర్నర్!!