https://oktelugu.com/

థర్డ్ వేవ్: మరో సంచలన విషయం

కరోనా మొదటి వేవ్ అల్లాడించింది. సెకండ్ వేవ్ తో దేశంలో మరణ మృదంగం వినిపించింది. సెకండ్ వేవ్ దేశంలో ఎంతో విషాదాన్ని మిగిల్చింది. దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ప్రతిరోజు కేసులు వస్తూనే ఉన్నాయి. తీవ్రత ఇంకా పలు చోట్ల ఉంది. అయితే థర్డ్ వేవ్ చేదు అనుభవాలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. థర్డ్ వేవ్ వస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంది. అందరికంటే ఎక్కువ తీవ్రతగల మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2021 / 06:25 PM IST
    Follow us on

    కరోనా మొదటి వేవ్ అల్లాడించింది. సెకండ్ వేవ్ తో దేశంలో మరణ మృదంగం వినిపించింది. సెకండ్ వేవ్ దేశంలో ఎంతో విషాదాన్ని మిగిల్చింది. దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ప్రతిరోజు కేసులు వస్తూనే ఉన్నాయి. తీవ్రత ఇంకా పలు చోట్ల ఉంది.

    అయితే థర్డ్ వేవ్ చేదు అనుభవాలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. థర్డ్ వేవ్ వస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంది. అందరికంటే ఎక్కువ తీవ్రతగల మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కీలక హెచ్చరిక చేసింది.

    ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించిన టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక హెచ్చరిక చేసింది. మహారాష్ట్రలో మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లోనే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని బాంబు పేల్చింది.

    సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో టాస్క్ ఫోర్స్ తాజాగా తమ నివేదికను బయటపెట్టింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ తలెత్తుతోందని.. కేసుల సంఖ్య రెట్టింపు అవుతాయని సీఎంకు అధికారులు నివేదించారు.

    ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ముఖ్యంగా చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.