విశాఖ అభివృద్ధి పై మంత్రి అవంతి కీలక ప్రకటన
విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అలాగే 9 బీచ్ లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో భూముల ఆక్రమణలు జరుగకుండా చూసి వాటిని కాపాడాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు.
Written By:
, Updated On : June 17, 2021 / 06:19 PM IST