Police suspended: దొంగలను పట్టుకునేందుకుగాను పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా పట్టుకున్న వారికి శిక్షించేందుకుగాను న్యాయస్థానంలో సబ్మిట్ చేసి నేరం నిరూపిస్తారు. అలా నిందితులకు శిక్ష ఖరారు అవుతుంది. అయితే, మనం తెలుసుకోబోయే ఈ ఘటనలో దొంగ మామూలు వాడు కాదు.. గజ దొంగ.. వీడి వలన పోలీసులపైన సస్పెన్షన్ వేటు పడిందంటే.. వీరు ఎంత పెద్ద దొంగలో అర్థం చేసుకోండి..
ఈ దొంగ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..ఓ దొంగ మహబూబ్ నగర్ జీఆర్ పీ పోలీస్ స్టేషన్ నుంచి పరారు అయ్యాడు. అతడు కర్నాటకలోని రాయిచూరు జైలు నుంచి పీటీ వారెంట్పై వచ్చాడు. సదరు నిందితుడిని వివిధ కేసుల్లో విచారణకు తీసుకొని వచ్చారు. కాగా, అతడు మహబూబ్ నగర్ రైల్వే పోలీసుల కళ్లు గప్పి పారిపోవడం స్థానికంగా సంచలనం అయింది. ఈ క్రమంలోనే అతడు పారిపోయినందుకుగాను చర్యల కింద ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. నెలన్నర కిందట ఈ ఘటన జరిగింది. కాగా, ఆ నిందితుడి కోసం కోసం తెలంగాణ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Dhoni: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు చేదు వార్త.. ధోని సంచలన నిర్ణయం..!
ఇంతకీ నిందితుడి పేరేంటంటే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలోని ఓర్ని గ్రామానికి చెందిన దానేదార్ సింగ్.. ఇతను రైళ్లలో చోరీలు చేస్తుంటాడు. అలా పెద్ద పెద్ద దొంగతనాలు చేయడం ఇతడికి అలవాటు. కాగా, పోలీసులు ఇతడిని పట్టుకుని శిక్షించారు కూడా. కానీ, ఇతడు చోరీలు చేయడం మాత్రం ఆపలేదు. పలు మార్లు పోలీసులకు చిక్కి మళ్లీ బయటకు వచ్చాడు. గతంలో కర్నాటకలో వరుస దొంగతనాలు చేసిన ఈయన.. ప్రస్తుతం హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
అక్కడ కూడా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే మహబుబ్ నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలో ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలసులు కేసు నమోదు చేశారు. రాయచూర్ జైల్‌లో ఉన్న దానదార్ సింగ్‌ను విచారణకు గతేడాది నవంబరు 24న మహబూబ్నగర్ తీసుకొచ్చారు. అలా వచ్చిన క్రమంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసుల కళ్లుగప్పి అదే రోజు అర్ధరాత్రి అతడు స్టేషన్ నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు ఇతగాడి కోసం వెతుకుతున్నారు.
Also Read: సినీతారల సంక్రాంతి అప్డేట్స్ మీకోసం..!